బాలయ్య హోస్ట్ గా ఆహా లో అన్స్టాపబుల్ కొత్త సీజన్ టెలికాస్ట్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాలుగో సీజన్ 4 ఎపిసోడ్ లో బన్నీ గెస్ట్ గా వచ్చాడు. మొదటి భాగం ఆల్రెడీ ఆహలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అందులో తన తల్లి నిర్మలమ్మ కూడా వచ్చింది. అయితే రెండో భాగంలో అల్లు అర్జున్ పిల్లలైన అల్లు అయాన్, అల్లు అర్హాలు విచ్చేస్తున్నారు. వాళ్లతో బాలయ్య బాబు ముచ్చట్లు పెట్టగా తెలుగు వచ్చా అని బాలయ్య అర్హాన్ని అడిగారు.
దానికి అర్హ నవ్వుతూ వచ్చు అని చెప్పి టెన్త్ క్లాస్ పద్యం అయిన అటజని కాంచె భూమిసురడంబరు చుంబి అంటూ సాగే పద్యాన్ని సునాయాసంగా చెప్పేసింది. అది విన్న బాలయ్య మురిసిపోతూ తెలుగు పది కాలాలపాటు బతుకుతుంది అన్న నమ్మకం నిన్ను చూసిన తర్వాతే వచ్చిందమ్మా అంటూ సంబరపడ్డాడు. ఈ కాలంలో పెద్ద నటీనటులకి సైతం తెలుగులో మాట్లాడడం, రాయడం అనేది కష్టం అయిపోతున్న సమయంలో అల్లు అర్జున్ తన పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలుగుని నేర్పించి మంచి పని చేశారు.
మిగిలిన స్టార్ కిడ్స్ తో పోలిస్తే అర్హ తెలుగు చాలా స్పష్టంగా సునాయసంగా మాట్లాడుతుంది. గతంలో కూడా శాకుంతల సినిమా ప్రమోషన్స్ లో సమంత, అర్హ తెలుగు గురించి మాట్లాడుతూ చిన్నప్పటినుంచే అర్హకి తెలుగు మాట్లాడడం అలవాటు చేశారు అల్లు అర్జున్ అది చాలా మంచి విషయం అంటూ అర్హని పొగిడింది. ఈ కాలంలో అందరూ ఇంగ్లీష్ భాష వెనుకన తిరుగుతూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం తన మూలాలను మర్చిపోకుండా పిల్లలు ఇద్దరికీ తెలుగు నేర్పించడం అభిమానులకు ఎంతో నచ్చింది.
బాలయ్య సైతం వారిద్దరినీ మురిసిపోయారు. రెండవ భాగం ఎపిసోడ్ టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన కొద్దిసేపటికి ఎంతో వైరల్ అయిపోయింది. ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదల కావడంతో ఫుల్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు బన్నీ. దీని భాగంగానే అన్ స్టాపబుల్ షో కి వచ్చి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు.