బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్.. అవినాష్‌కు వచ్చిన మొత్తం ఎంతంటే?

Avinash Bigg Boss Remuneration Leaked

బిగ్ బాస్ షోలోని నాల్గో సీజన్ కంటెస్టెంట్లకు మంచి రాబడి వచ్చినట్టుంది. ప్రతీ ఒక్కరికి మంచి రెమ్యూనరేషన్ వచ్చిందని తెలుస్తోంది. అంతే కాకుండా నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో చాలా మందికి డబ్బులతో పాటు పేరు, దాంతో పాటు మంచి సినీ ఆఫర్లు కూడా వచ్చాయి. అందరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. మొత్తానికి నాల్గో సీజన్ మాత్రం అందరికీ బాగానే కలిసి వచ్చేస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలోనూ అందరికీ మంచే జరిగినట్టుంది.

కంటెస్టెంట్లందరి రెమ్యూనరేషన్ కంటే అవినాష్‌కు వచ్చిన మొత్తం మీదే అందరి దృష్టి పడింది. ఎందుకంటే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లేందుకు అవినాష్ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మల్లెమాల టీం అవినాష్‌కు అడ్డుకట్ట వేయడం.. అగ్రిమెంట్ చూపించి భయపెట్టడం వంటివి చేసింది. దాంతో చేసేదేం లేక పది లక్షలు కట్టేశాడు. అలా పది లక్షలు కట్టి మరి బిగ్ బాస్ షోకి వెళ్లినట్టైంది. అయితే కనీసం ఆ పది లక్షలు వచ్చాయా? లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

Avinash Bigg Boss Remuneration Leaked

పది లక్షల కంటే ఎక్కువే వచ్చాయి.. నాకున్న అప్పులన్నీ తీరిపోయాయ్ అని అవినాష్ ప్రతీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ మొత్తంగా ఎంత వచ్చిందో మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది. క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అలీ మాట్లాడుతూ అసలు విషయం బయట పెట్టేశాడు. బిగ్ బాస్ ఇంట్లో మూడు నెలలు ఉంటే యాభై లక్షలు ఇస్తారని అవినాష్ చెప్పాడంటూ అలీ అందరి ముందే బయటకు చెప్పేశాడు. అలా అవినాష్‌కు బిగ్ బాస్ వల్ల యాభై లక్షలు వచ్చాయని అందరికీ తెలిసిపోయింది.