ఆ నటిని అంత మాట అనేశాడా.. విజయ్ దేవరకొండకు మరీ అంత బలుపా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు ఉండే యాటిట్యూడ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే వరుస సక్సెస్‌లు విజయ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే అందనంత ఎత్తుకు చేరిపోయాడు. విజయ్ దేవరకొండకు ఫ్లాపులేమీ కొత్త కాదు. అయినా సరే విజయ్ ఫాలోయింగ్ ఏనాడూ తగ్గలేదు. రోజురోజుకూ రౌడీ స్టార్ ఇమేజ్ పెరుగుతూనే వస్తోంది. కొన్ని సార్లు విజయ్ చేసే పనులు మాత్రం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంటాయి.

Artist Rajitha ABout Vijay Devarakonda In Suma Cash Show
Artist Rajitha ABout Vijay Devarakonda In Suma Cash Show

హరీష్ శంకర్ ఓ సారి విజయ్ దేవరకొండతో జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. హరీష్ శంకర్ ఫోన్ చేస్తే విజయ్ అన్న మాటకు షాక్ అయ్యాడట. స్టోరీ చెప్పేందుకు అయితే మాట్లాడకండి వేరే ఏదైనా ఉంటే చెప్పండి అని మొహం మీదే చెప్పేశాడట. పూరి జగన్నాథ్ విషయంలోనూ అంతే.. ఫైటర్ సినిమాను అంత ఈజీగా ఒప్పుకోలేదని టాక్. ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన తరువాతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఇక తాజాగా ఓ సీనియర్ ఆర్టిస్ట్‌ను పట్టుకుని మీరు నటిస్తారా? అని అడిగేశాడట. సీనియర్ ఆర్టిస్ట్ రజితను విజయ్ దేవరకొండ అవమానించినట్టు తెలుస్తోంది. తాజాగా ఆమె క్యాష్ షోలో ఓ విషయాన్ని బయట పెట్టింది. హాయ్ విజయ్ నేను ఆర్టిస్ట్‌ను అని పలకరిస్తే.. మీరు నటిస్తారా? అని మొహం మీదే అనేశాడట. అయితే నిజంగానే విజయ్ తెలియక అన్నాడో మరి ఇంకేదైనా కారణంతో అలా అన్నాడో అతనికే తెలియాలి.

https://www.youtube.com/watch?v=X6W62NcsHWI&feature=youtu.be