లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే… బిగ్ బాస్ ప్రోమో వైరల్!

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ కార్యక్రమ సందడి మొదలైంది.గత కొన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇకపోతే ఈ కార్యక్రమం సెప్టెంబర్ 1 వారంలో ప్రసారం కానుంది అని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున చెప్పే డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి.

ఈ ప్రోమోలో తల్లిదండ్రులు తమ కూతురికి పెళ్లి చేసి అప్పగింతల సమయంలో కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉండగా అదే సమయంలో బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ రావడంతో ఒక్కసారిగా అందరూ మాయమవుతారు. పెళ్లికూతురు అమ్మ నాన్న అంటూ వెతుకుతూ ఉండగా నాగార్జున ఎంట్రీ ఇస్తూ మై డియర్… అప్పగింతల వరకు ఎవరు ఆగలేకపోయారు అంటే ఆట మొదలైనట్టే…లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే అంటూ నాగార్జున బిగ్ బాస్ గురించి చెబుతూ మరింత ఆసక్తిని కలిగించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.

గత కొద్ది రోజుల క్రితం ఈ సీజన్ కి సంబంధించిన లోగో విడుదల చేశారు.లోగో ఈ సీజన్ పై అంచనాలు పెంచగా ఈ ప్రోమో మరిన్ని అంచనాలను పెంచాయి. అయితే మరొక ప్రోమో విడుదల చేసినప్పుడు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయాన్ని కూడా అధికారకంగా వెల్లడిస్తారని సమాచారం. ఇకపోతే ఈ సీజన్ కి కూడా నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం.

Bigg Boss Telugu Season 6 Promo | Nagarjuna Akkineni | #BiggBossTelugu6 on Star Maa