యాంకర్ సుమను బుల్లితెరపై గమనించేవారికి ఓ విషయం ఇట్టే అర్థమవుతుంటుంది. ఆమె ఏ చానెల్ ఏ షోలో కనిపించినా కూడా వేసే స్టెప్పులు మాత్రమే ఒక్కటే. సుమకు అంతగా మూమెంట్స్, డ్యాన్స్ రాదు. వచ్చిన నాలుగైదు స్టెప్పులనే అటు తిప్పి ఇటు తిప్పి వేసేస్తుంటుంది. పైగా తన డ్యాన్సుల మీద తానే కౌంటర్లు వేసుకుంటుంది. అలా సుమకు డ్యాన్స్ అంటే మహా చెడ్డ చిరాకు అని అందరూ అనుకోకండి.
తాజాగా అసలు విషయం సుమ బయటకు చెప్పేసింది. చిన్నతనంలో స్పెషల్‌గా డ్యాన్స్ క్లాసులకు వెళ్లిందట. సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుందట. ఇదే విషయాన్ని తాజాగా గుర్తుకు చేసుకుంది సుమ. అంతే కాకుండా చిన్న నాటి గుర్తులను అందరితోనూ పంచుకుంది. ఈ మేరకు సుమ చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో రెండూ వైరల్ అవుతున్నాయి.
తాజాగా సుమ ఓ పోస్ట్ చేసింది. ఇందులో చిన్నతనంలో స్కూల్‌లో పర్ఫామెన్స్ ఇచ్చిన ఓ స్టిల్‌ను షేర్ చేసింది. డ్యాన్స్ అంటే తన తల్లికి ఎంతో ఇష్టమట.. తాను డ్యాన్స్ నేర్చుకోవాలనేది అమ్మ కోరిక అంటా.. తనకు కూడా డ్యాన్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమట… అలా చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకుని స్కూల్‌లో పర్ఫామెన్స్ ఇచ్చిన సందర్భంలో దిగిన ఫోటోనే ఇది అంటూ సుమ చెప్పుకొచ్చింది. ఈ సందర్బంగా తన గురువును కూడా సుమ తలుచుకుంది.