అలాంటి ఫోటో షేర్ చేసిన యాంకర్ స్రవంతి.. ఆశు రెడ్డిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం అవుతూ సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ అశు రెడ్డి ఒకరు. ఈమె టిక్ టాక్ వీడియోలు డబ్ స్మాష్ వీడియోలు ద్వారా విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమెకు రెండుసార్లు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా ఆశు రెడ్డి తరహాలోనే సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు యాంకర్ స్రవంతి. ఈమె కెరియర్ మొదట్లో యూట్యూబ్ యాంకర్ గా పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ మంచి గుర్తింపు పొందారు. అనంతరం బుల్లితెరపై జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.ఈ క్రమంలోనే తనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఈమె చేసిన హంగామాకి విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు..

ఎంతో సాంప్రదాయమైన కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి స్రవంతి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీచుల దగ్గర బికినీలు ధరించి ఫోటోలకు ఫోజులు ఇవ్వడమే కాకుండా పలు గ్లామరస్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈమె తన గ్లామరస్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసినటువంటి కొందరు నెటిజన్ లు ఈ ఫోటోని అశు రెడ్డికి ట్యాగ్ చేస్తూ.. ఇదంతా నీ ట్రైనింగ్ ఏ కదా అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.