పెళ్లి కూతురిలా ముస్తాబై పల్లకిలో ఊరేగిన యాంకర్ శ్యామల… కోరిక తీరిందంటూ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సీరియల్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన శ్యామల ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసరమైన అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు పొందింది . ప్రస్తుతం శ్యామల బుల్లితెర మీద ప్రచారం అవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లలో యాంకర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

ఇలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లు, టీవీ షోలతో బిజీగా ఉండే శ్యామల సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో యూట్యూబ్ లో సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇలా శ్యామల తన అందమైన ఫోటోలతో పాటు వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల శ్యామల తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నరసింహారెడ్డి అనే వ్యక్తిని శ్యామల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో తన పెళ్లిని ఘనంగా చేసుకోలేకపోయింది. అందువల్ల ఇప్పుడు తన పెళ్లి సమయంలో నెరవేరని కోరికను తీర్చుకుంది. పెళ్లికూతురుగా ముస్తాబయి పల్లకిలో ఊరేగుతూ వచ్చి తన పెళ్లినాటి కోరికను నెరవేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని శ్యామల తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేస్తూ…నా పెళ్లిలో మిస్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.