Shyamala: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పే… ఇకపై అలా చేయ్యము: శ్యామల

Shyamala: ప్రస్తుతం తెలంగాణ పోలీసుల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతున్నారు. వారు ఎంతటి పెద్దవారు అయినా సరే వెనుకడుగు వేయకుండా వారిపై కేసులు నమోదు చేస్తూ విచారణకు పిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది యూట్యూబర్స్ చిక్కుల్లో పడ్డారు అదే విధంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు హీరో హీరోయిన్లు కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో చిక్కుకున్నారు.

ఇకపోతే యాంకర్ శ్యామల సైతం ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమెపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అయితే కోర్టును ఆశ్రయించిన శ్యామల అరెస్టు నుంచి ఉపశమనం పొందారు కానీ, పోలీస్ విచారణకు హాజరు కావాలి అంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేయడంతో నేడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈమె విచారణకు హాజరు అయ్యారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విచారణ అనంతరం యాంకర్ శ్యామల మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ…బెట్టింగ్ యాప్స్ అంశం పై విచారణ జరుగుతుందన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయం గురించి ఏమీ మాట్లాడదలచుకోలేదని తెలిపారు.

నాకు చట్టంపై ఎంతో గౌరవం ఉంది పోలీసుల విచారణకు తాను పూర్తి సహకారం మద్దతు తెలుపుతానని వెల్లడించారు. ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం పూర్తిగా తప్పేనని ఈమె ఒప్పుకున్నారు. నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదని అన్నారు. ఇక పై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయము అని తెలిపారు. ఇలా విచారణ అనంతరం మీడియా సమావేశంలో శ్యామల మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.