నామినేషన్ సందర్భంగా నటరాజ్ మాస్టర్ చెప్పిన గుంటనక్కను తానేనని ఒప్పుకున్నాడు రవి. అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఆ విషయాన్ని ఎత్తలేదు. కానీ, మళ్లీ రవినే ఈ ఇష్యూ ఎత్తుకున్నాడు. తోటి హౌస్ మేట్స్‌తో ఈ విషయమై డిస్కషన్ పెట్టాడు. ఆ తర్వాత విశ్వను ఈ విషయంలోకి లాగాడు. నేను కాదు గుంటనక్క, నువ్వేమో అని డౌట్‌గా ఉందంటూ, విశ్వను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నటరాజ్ మాస్టర్‌కీ, విశ్వకీ మధ్య ఫిట్టింగ్ పెట్టడానికి చూశాడు. ఓ పక్క గుంటనక్క అనిపించుకుంటూనే, మరోవైపు కలహ భోజనుడు నారదుడి పాత్ర కూడా తానే పోషించేస్తున్నాడు యాంకర్ రవి.
అయితే, ఇదంతా ప్రేక్షకులకు ఎంటర్టైన్ పంచేలా ఉంటే ఓకే. కానీ, రవి చేస్తున్న చేష్టలు తన క్యారెక్టర్‌ని డీగ్రేడ్ చేసేలా ఉంటున్నాయనే విషయాన్ని మర్చిపోతున్నాడు. బహుశా గేమ్‌లో ఇదో కొత్త స్ర్టాటజీ అవ్వొచ్చు గాక. కానీ, ఆయన ఫ్యాన్స్ కూడా ఈ అంశంపై రవిని తప్పు పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా యాంకర్ రవిపై విపరీతమైన నెగిటివిటీ ప్రచారం జరుగుతోంది. మరోవైపు హౌస్‌లోనూ రవిని ఎవరూ నమ్మడం లేదు. కాజల్ అయితే, రవి పట్ల తీవ్రమైన నెగిటివ్ ఒపీనియన్ ఏర్పర్చేసుకుంది. చూడాలి మరి, ముందు ముందు ఈ వ్యవహారాన్ని యాంకర్ రవి ఎలా డీల్ చేసుకుంటాడో, తనను తాను ఎలా మార్చుకుంటాడో.