మహానటి సావిత్రిని మరపించిన యాంకర్ హరితేజా.. వైరల్ అవుతున్న వీడియో!

ఎన్నో సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న హరితేజ మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తూ సందడి చేసింది. ఇలా యాంకర్ యాక్టర్ గా గుర్తింపు పొందిన హరితేజ బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా పాల్గొనింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతుంది. గతంలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొన్న హరితేజ హరికథ స్క్రిప్ట్ స్కిర్ చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత హరితేజ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తోంది.

ఎలా సినిమాలు టీవీ షోస్ తోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా హరితేజ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విశేషాలతో పాటు తన కూతురు భూమి ఫోటోలను కూడా తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ఈటీవీ వారు “నవరాత్రి ధమాకా” అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ కార్యక్రమంలో హరితేజ కూడా పాల్గొనింది.

సంఘవి, ప్రేమ వంటి అలనాటి హీరోయిన్లు ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఆది, రవి ఇద్దరు గొడవ పడుతూ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించాలని ఒకరు లేదు విజయవాడలో నిర్వహించాలని మరొకరు గొడవపడ్డారు. ఇక హైపర్ ఆది డాడీ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడి’ అనే పాటకి పర్ఫామ్ చేసి అందరి చేత కంటతడి పెట్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న హరితేజ కూడా ‘మాయా బజార్’ సినిమాలో సావిత్రి చేసిన పాత్రతో సందడి చేసింది. అంతేకాకుండా సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించండి. హరితేజ నటన చూసి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.