ఎన్నాళ్లకు మెడలో అది కనిపించింది అనసూయ.. మరోసారి అనసూయ పై మొదలైన ట్రోలింగ్స్?

అనసూయ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పేరు.ఎప్పుడైతే ఈమె విజయ్ దేవరకొండ సినిమాని ఉద్దేశిస్తూ పరోక్షంగా పోస్ట్ చేశారో అప్పటినుంచి ఈమెనూ నెటిజన్స్ దారుణంగా ఆంటీ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇలా తనని ఆంటీ అన్న వారిపై ఈమె పోలీస్ కేసు వేస్తా అన్నప్పటికీ తగ్గేదే అంటూ నేటిజెన్లు సైతం పెద్ద ఎత్తున ఆంటీ అనే పదాన్ని ట్రెండ్ చేశారు.ఇక ఈ విషయంపై సీరియస్ అయినా అనసూయ ఏకంగా పోలీస్ కేసు కూడా పెట్టారు ప్రస్తుతం ఇది ప్రాసెస్ జరుగుతుందని ఆమె వెల్లడించారు.

ఇక ఈ వివాదం కాస్త సద్దుమణిగింది అనే లోగా అనసూయ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేశారు. ఇలా తన ఫ్యామిలీతో కలిసి ఈమె విజయవాడ వెళ్ళినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే అనసూయ షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం ఆమె ఏదో పూజ కార్యక్రమాల కోసమే విజయవాడ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇలా పూజా కార్యక్రమాలలో పాల్గొన్న అనసూయ గోశాలను కూడా సందర్శించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మరోసారి నెటిజన్లు రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే మరోసారి అనసూయని ఆంటీ అని సంబోధిస్తూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.కొందరు హ్యాపీ జర్నీ అంకుల్ ఆంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ అయితే ఎన్నాళ్లకు నీ మెడలో ఇలా తాళిని చూసాము అనసూయ అంటూ కామెంట్ చేయడం గమనార్హం. అయితే ఈ ఫోటోలపై స్పందించిన నెటిజన్లు ఎక్కువగా ఆంటీ అని సంబోధిస్తూ ఈమె పై మరోసారి దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు.