కుటుంబ సభ్యులతో అనసూయ సంక్రాంతి సంబరాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ కామెడీ షో రా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అనసూయ.. ఆ షోలో తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా యాంకర్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈ క్రమంలో క్షణం, రంగస్థలం, పుష్ప వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటనతో వెండితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇలా సినిమాలు, టీవీ షో లతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయటమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే కొన్ని సందర్భాలలో అనసూయ షేర్ చేసే పోస్టుల వల్ల విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే తనని విమర్శిస్తూ కామెంట్ చేసే వారికి తనదైన శైలిలో అనసూయ గట్టిగా సమాధానం చెబుతూ ఉంటుంది. ఇలా సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసినా కూడా ఆ ట్రోల్స్ కి భయపడకుండా వారికందరికీ దీటుగా సమాధానం చెబుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా అనసూయ తర షూటింగ్ పనులతో ఎంత బిజీగా ఉన్నా కూడా వీలైనప్పుడల్లా తన కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉంటుంది. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి అనసూయ తరచు వెకేషన్ కి వెళ్తూ ఉంటుంది. ఇలా వెకేషన్ కి వెళ్ళిన సమయంలో తీసుకున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సామాన్య ప్రజలతోపాటు సెలబ్రిటీలో కూడా పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. అనసూయ కూడా సంక్రాంతి పండుగను తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఘనంగా జరుపుకుంది. సంక్రాంతి పండుగ రోజున కుటుంబంతో కలిసి అనసూయ గాలిపటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం అనసూయ సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసి అనసూయ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, మరి కొంతమంది నెటిజన్లు మాత్రం ఎప్పటిలాగే ఆమె గురించి నెగటివ్ గా కామెంట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.