తనని టచ్ చేస్తే ఇంత ఎత్తున ఎగిరే అనసూయ ఆయన విషయంలో ఎందుకంత మౌనం?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఈమె సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలావరుస సినిమా అవకాశాలతో కెరియర్ లో ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా తనను ఎవరైనా ట్రోల్ చేస్తే ఇంతెత్తున వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి లెఫ్ట్ రైట్ ఇస్తుంది.

ఇకపోతే గత వారం రోజులుగా అనసూయను సోషల్ మీడియాలో ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా తనని ఆంటీ అన్న వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై కేసు పెడతానని నేటిజన్ లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇకపోతే ఈమె నెటిజన్ల పై ఆగ్రహం వ్యక్తం చేయగా కమెడియన్ బ్రహ్మాజీ మాత్రం తనని అంకుల్ అంటూ కామెంట్లు చేయడంతో అంకుల్ అంటే కేసు వేస్తా అంటూ పరోక్షంగా అనసూయని ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు.ఇలా నెటిజన్లపై మండిపడిన అనసూయ పరోక్షంగా తనని ఉద్దేశించి బ్రహ్మాజీ ట్వీట్ చేసినప్పటికీ ఆయన ట్వీట్ పై ఏ మాత్రం స్పందించలేదు.

ఈ క్రమంలోని కొందరు నెటిజన్ లు ఈ విషయం గురించి స్పందిస్తూ తనని అన్న అభిమానులపై గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ బ్రహ్మాజీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది. తన వస్త్రధారణ గురించి కామెంట్ చేసిన కోట శ్రీనివాసరావు వంటి వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన ఈమె బ్రహ్మాజీ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది అంటూ అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి బ్రహ్మాజీ విషయంలో అనసూయ మౌనానికి గల కారణం ఏంటి అనే విషయం తెలియాల్సి ఉంది.