బిగ్ బాస్ బ్యూటీ హిమజ రెబెల్ నేచర్ అన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఆమె చూపించిన తెగువ, ఎదురించే ధైర్యం, కొట్లాడే స్వభావం మనమంతా చూశాం. నిజ జీవితంలో హిమజ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒకరిని చితకబాదేసిందట. ఈ ఘటను గురించి తాజాగా హిమజ బయటకు చెప్పేసింది. అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హిమజ ఎన్నో విషయాలను బయట పెట్టేసింది.
మొదట టీచర్‌గా పనిచేశాను అని ఆ తరువాత సాఫ్ట్‌వేర్‌లో ట్రైచేశాను అని చివరకు ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. మొదటగా బుల్లితెరపై కనిపించాను అని చెప్పింది. అక్కడ రెండేళ్లు కష్టపడ్డాక సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. సినిమాల్లో పనిమనిషి క్యారెక్టర్ వస్తే చేయొద్దని కొందరు భయపెట్టారని తెలిపింది. కానీ ధైర్యంగా చేసేశానని అలా బుల్లితెర, వెండితెర తనకు కలిసొచ్చాయని చెప్పుకొచ్చింది.
ఓ రోజు సెట్‌లో ఎవరినో కొట్టేశావట కదా అని అలీ అడిగాడు. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ.. ఓ రోజు షూటింగ్ జరిగే లొకేషన్‌కి కొత్త కారుతో వెళ్లాను. లొకేషన్‌లోనే కారుని పార్క్ చేశాను. మాతోపాటు వర్క్ చేసే ఓ వ్యక్తి.. కారు పార్కింగ్ గురించి నాతో గొడవపడ్డాడు. నాకు కోపం వచ్చేసింది. సెట్‌లోనే కొట్టేశాను అని సింపుల్‌గా చెప్పేసింది.