ఢీ షో కోసం ఆది, అఖిల్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా?

ఈటీవిలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ప్రముఖ డాన్స్ షో ఢీ కి గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదని చెప్పటంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా నంబర్ వన్ డాన్స్ షోగా గుర్తింపు పొందిన ఈ ఢీ డాన్స్ షో ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు పొందిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వంటి డాన్స్ కొరియోగ్రాఫర్లందరూ కూడా ఢీ షో నుండి వచ్చినవారే. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ షో క్రేజ్ బాగా తగ్గింది. డాన్స్ షో లో డాన్స్ చేయకుండా జిమ్నాస్టిక్స్ చేస్తూ.. కామెడీ చేస్తూ.. డాన్స్ షోని కామెడీ షో చేసేసారు.

ముఖ్యంగా ఈ షోలో హైపర్ ఆది మెంటర్ గా సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫ్రేమ్ అఖిల్ కూడా ఈ షో లో డాన్సర్స్ కి మెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన అది తనదైన శైలిలో అందరి మీద పంచులు సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ ఢీ షో లో ఆది అఖిల్ టార్గెట్ చేసి అతనిమీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఇలా డాన్సర్లు కొరియోగ్రాఫర్లు జడ్జిలు అని తేడా లేకుండా ఆది అందరి మీద పంచులు వేస్తూ ఢీ షో ని ముందుకి నడిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఢీ షో లో సందడి చేస్తున్న ఆది, అఖిల్ రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఢీ షో లో వీరిద్దరి పాపులారిటీని బట్టి మల్లెమాలవారు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయినా అది బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు పొంది ఈటీవీలో ప్రసారమవుతున్న అన్ని టీవీ షోస్ లో సందడి చేయడమే కాకుండా తాజాగా మల్లెమాల వారి రూల్స్ కి విరుద్ధంగా మాటీవీలో ప్రసారమైన మా పరివార్ అవార్డ్స్, బిగ్ బాస్ ఎపిసోడ్ లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఇదిలా ఉండగా ఢీ షో లో అఖిల్ కి ఆది కన్నా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన అఖిల్ ఆ గుర్తింపు వల్లే ఈటీవీలో కొనసాగుతున్నప్పటికీ… ఆది లాగా సందడి చేయలేకపోతున్నాడు . అందువల్ల మల్లెమాలవారు అఖిల్ కన్నా ఆదికే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.