బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… గౌతమ్ తన ఇంట్లోనే రిషి తల్లిదండ్రులను పెట్టుకొని ఆ విషయం తనకు చెప్పకుండా మోసం చేశాడని బాధపడుతూ ఉంటారు. రాత్రంతా ఈ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుండగా మరోసారి రోజు ఉదయం వసుధార తనకు కాఫీ తీసుకువస్తుంది. అలాగే వసుధార రిషి ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటారు.
మరోవైపు గౌతమ్ మహేంద్ర కు ఫోన్ చేసి వాడు నన్ను పూర్తిగా దూరంపెట్టాడు అంకుల్ నాపై వాడికి నమ్మకం పోయింది నన్ను అంతగా అవమానించిన తర్వాత నేను ఇక్కడ ఉండను నేను అమెరికా వెళ్ళిపోతున్నాను అని చెబుతూ మాట్లాడతారు. నా మాట విను గౌతమ్ వెళ్ళకు వాడు మామూలే మల్లి నీతో ఎప్పటిలాగే కలిసుంటాడని మహేంద్ర చెబుతున్న వినకుండా గౌతమ్ వసుధార జగతి మేడంను అడిగానని చెప్పండి మీరందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ ఫోన్ కట్ చేస్తాడు.
ఇక గౌతమ్ బయలుదేరుతూ ఉండగా బయట వసుదారా రిషి ఇద్దరు కనిపించడంతో షాక్ అవుతారు. ఏంట్రా ఇడియట్ నాకు చెప్పకుండా అమెరికా ఫ్లైట్ ఎక్కేద్దామనుకుంటున్నావా… నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అంటూ ఏమీ తెలియనట్టు మాట్లాడతారు. ఇలా రిషి సంతోషంగా పోయి గౌతమ్ ను హగ్ చేసుకోవడంతో గౌతమ్ కూడా ఆశ్చర్యంగా తనని హగ్ చేసుకుంటాడు.అసలు నిజం ఏంటో డాడ్ నాకు అంత చెప్పాడు. డాడ్ వాళ్ళను చాలా బాగా చూసుకున్నందుకు థాంక్యూ అంటూ మరొకసారి తనని హగ్ చేసుకుంటాడు. ఇదంతా చూసిన వసుధార సంతోషపడుతుంది.
ఇక వసుధార రిషి గౌతమ్ ముగ్గురు ఇంటికి వెళ్ళగా అది చూసిన మహేంద్ర ఎంతో సంతోషిస్తాడు. అప్పుడు రిషి గౌతమ్ ఇంట్లో మర్చిపోయిన వాచ్ ని తన తండ్రికి తొడిగిస్తాడు. అయితే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యంగా దేవయానికి చూస్తూ ఉంటుంది. ఇక రిషి జరిగినది మొత్తం చెప్పగా ఒక్కసారిగా దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు దేవయాని గౌతమ్ పై సీరియస్ అవ్వగా వాడిని ఏమీ అనద్దు పెద్దమ్మ అంటూ అడ్డుపడతారు. రిషి గౌతమ్ గురించి గొప్పగా చెబుతూ ఉండగా దేవయాని తనపై సీరియస్ కావడంతో వసుధార అడ్డుకుంటుంది.
అంతా ప్లాన్ చేసుకొని ఇలా చేశారన్నమాట ఈ ప్లాన్ లో నీకు కూడా భాగం ఉందా నీకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా వసుధార అంటూ దేవయాని మాట్లాడటంతో రిషి ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి పెద్దమ్మ అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు జగతి నీళ్లు తాగడం కోసం వాటర్ బాటిల్ తీసుకుంటూ ఉండగా జగతి వాటర్ బాటిల్ అందించి తాగు అంటూ దొంగ ప్రేమ చూపిస్తుంది. ఎంతైనా నువ్వు తెలివైన దానివి జగతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇన్ని రోజులు గౌతమ్ ఇంట్లో మఖాం వేశావు చూడు అందుకు ఒప్పుకోవచ్చు అంటూ దేవయాని చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. నటించకు జగతి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది అని దేవయాని చెప్పగా జగతి షాక్ లో ఉండిపోతుంది.