నిజం తెలుసుకొని అనసూయను ఇంటి నుంచి వెళ్లగొట్టిన నందు… షాక్ లో తులసి!

కుటుంబ కథ నేపథ్యంలో కుటుంబ విలువలను తెలియజేస్తూ స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే పరంధామయ్య తాను తిరిగి తన ఇంటికి రానని తులసివద్దే ఉంటానని తేల్చి చెప్పేస్తారు.

ఈ విధంగా పరంధామయ్య తనని కాదని చెప్పడంతో ఆమె తన భర్త లేని జీవితం తనకు వద్దు అంటూ ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతుంది.అనసూయ అలా వెళ్లడంతో గమనించిన తులసి మీరు మావయ్యను జాగ్రత్తగా చూసుకోండి నేను వెళ్లి అత్తయ్య ఎక్కడున్నారు వెతికి తీసుకు వస్తానని చెప్పి వెళ్తుంది. తన అత్తయ్య కోసం వెళ్తూ ఉండగా అనసూయ మాత్రం పరధ్యానంలో తన భర్త అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఆత్మహత్య చేసుకోవడానికి భావి వద్దకు వెళుతుంది. అది గమనించిన తులసి తనని కాపాడి తనకు నచ్చి చెప్పి వెనక్కి తీసుకెళ్తుంది.

మరోవైపు ఇంట్లో ఏదో జరుగుతుందన్న అనుమానంతో నందు ఇంటికి వస్తారు. అమ్మ నాన్న ఎక్కడ అంటూ ప్రశ్నలపై ప్రశ్నలు వేయగా అభి మాట మారుస్తూ ఉంటారు. అనుమానం వచ్చిన నందు లాస్యను నిలదీయగా లాస్య జరిగినది మొత్తం చెబుతుంది.దీంతో అసలు మీకు ఎలాంటి బాధ్యత లేదా ఎలా వెళ్లనిచ్చారు అంటూ గట్టిగ వారిపై సీరియస్ అవుతుంటారు.మా నాన్నని నేను దేవుడితో సమానంగా చూసుకుంటాను అలాంటి నా దేవుడిని ఇంట్లో లేకుండా పంపించారు మా నాన్న ఎక్కడ అంటూ అరుస్తారు.

ఇక తులసి అనసూయని తీసుకువస్తూ ఉండగా కాలనీ మొత్తం వారిని చూసి గుసగుసలు పెడుతుంది. ఆ మాటలు విన్న తులసి ఈ మాటలు వింటే ఎవరికైనా కోపం వస్తుంది కానీ మీరు ఇప్పుడే మాట్లాడకండి అత్తయ్య అంటూ తనని ఇంటికి తీసుకెళ్తుంది.ఇక ఇంట్లో నందు అభి పై లాస్య పై సీరియస్ అవుతూ ఉండగా వీళ్ళు గడప బయట ఆ మాటలను వింటూ షాక్ అవుతారు.ఇక నందు గడప బయట అనసూయ ఉండడం చూసి మా నాన్న లేని ఇంట్లో నువ్వు ఉండటానికి వీలు లేదు అంటూ తనని కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళగొడతాడు. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.