సుధీర్ మీద పంచుల వర్షం కురిపించిన ఆది.. అంత మాట అనేశాడేంటి ..?

సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి గుర్తింపు పొందిన సుధీర్ తన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ హీరోగా మారిపోయాడు. హీరోగా అవకాశాలు రావటంతో జబర్దస్త్ కి దూరమైన సుధీర్ ఇటీవల మరొకసారి ఈటీవీలో దర్శనమిచ్చాడు. ఈటీవీ ప్రారంభమై 27 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్లెమాల వారు భలే మంచి రోజులు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ స్పెషల్ ఈవెంట్లో సుధీర్ , అనసూయ కూడా సందడి చేశారు. ఇక ఎప్పటిలాగే ఆది తన పాంచులతో రెచ్చిపోయాడు. ముఖ్యంగా సుధీర్ ని టార్గెట్ చేసి సుధీర్ మీద పంచులు వర్షం కురిపించాడు. సుధీర్ మాత్రం చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు. ఈ కార్యక్రమంలో సుధీర్ ఎంట్రీ ఇవ్వగానే కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు సుధీర్ వద్దకు వచ్చి పిచ్చిపిచ్చిగా డాన్స్ చేశారు. నేను ఎంట్రీ ఇవ్వగానే వీళ్ళ ఎంట్రీ ఏంటి? అని సుధీర్ ప్రశ్నించగా ఒకసారి మారితే అందరూ మారుతారు మరి అంటూ కౌంటర్ వేశారు. ఆ తర్వాత ప్రదీప్ వచ్చి సుధీర్ మీ అందరిని ఒకచోట ఉంచగలడు అని అంటే ఆది స్పందిస్తూ ముందు అతన్ని ఒకచోట కుదురుగా ఉండమనండి అంటూ సెటైర్ వేస్తాడు.

ఇక మరొక సందర్భంలో సుధీర్ స్కిట్ చేస్తూ నేను ముందులా లేను చాలా మారిపోయాను అని అనగా .. ఏంటి పక్కా ఛానల్ కా? అంటూ ఆది పంచ్ వేసాడు. ఇక మరొక స్కిట్ లో మనకి బ్రేక్ లేదా? అని సుధీర్ అనగా..నీకు ఎప్పుడో బ్రేక్ ఇచ్చాం. ఇంకా నువ్వు ఇక్కడున్నావెందుకు అని ఆది కౌంటర్ వేసాడు. దీంతో సుధీర్ వెర్రిమోహం వేసుకొని చూసాడు. ఈటీవీ కి దూరమై మాటీవీలో యాంకర్ గా కొనసాగుతున్న సుధీర్ ఇలా తిరిగి రావటంతో ఆది ఇన్ డైరెక్ట్ గా సుధీర్ ని దెప్పిపొడిచాడు. ఇక ఈ కార్యక్రమంలో మరొక స్కిట్ లో ఇమాన్యుల్ తల మర్ధన చేయమని ఆర్డర్ వేయగా సుధీర్ మర్దన చేశాడు. ఏ స్టేజ్‌కు వచ్చావ్.. అని సుధీర్ మీద ఇమాన్యుల్ జాలి పడతాడు. ఇక ఆది కూడా కొంచం మోకాలి నొప్పి గా ఉంది అని అంటే సుధీర్ వచ్చి మోకాలి మీద కూర్చొని ఆది కాళ్ళు నొక్కటనికి వెళ్తాడు. చూసావా కావాలనే కిందకు వచ్చి మనల్ని బ్యాడ్ చేస్తున్నాడు అని ఆది అంటాడు. మొత్తానికి సుధీర్ రాకతో ప్రేక్షకులు సంబర పడుతున్నారు.