అందరి ముందు అఖిల్ సంపాదన గురించి మాట్లాడి పరువు తీసిన ఆది..?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. మొదట కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టిన ఆది ఆ తర్వాత తన ప్రతిభతో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. ఆది వేసే పంచులు, డబుల్ మీనింగ్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆది జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా గుర్తింపు పొందాడు. అయితే గత కొంతకాలంగా అది జబర్దస్త్ లో కనిపించడం లేదు సినిమా అవకాశాలు ఎక్కువగా రావడం వల్ల అది జబర్దస్త్ కి దూరమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ లో సందడి చేస్తున్నాడు.

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రాంప్రసాద్ తో కలిసి హైపర్ ఆది చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇద్దరు కలిసి రష్మి ని ఒక ఆట ఆడుకుంటారు. మొత్తానికి ఆది, రామ్ ప్రసాద్ ఇద్దరు కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ఈటీవీలో ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఢీ లో కూడా ఆది సందడి చేస్తున్నాడు. సుధీర్, రష్మి ఢీ షో కి దూరమైన తర్వాత ఆది ఢీ షో లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షో ఆది జడ్జ్స్ మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు. అంతే కాకుండా ప్రదీప్ తో కలిసి బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ ని తమ పంచులతో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు.

ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో కూడా అఖిల్ మీద దారుణమైన పంచులు వేసాడు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయ్యింది. ఈ ప్రోమో లో ఆది వచ్చి ఎన్నేళ్లు అయ్యిందని అఖిల్ ని అడుగుతాడు. పదెళ్లు అయింది అని అఖిల్ సమాధానం చెప్పగా…అబ్బో పదేళ్ళంటే ఎంత సంపాదించుంటావ్? అని మళ్ళీ అఖిల్ ని అడుగుతాడు. దీంతో బాగానే సంపాదించా అని అఖిల్ సమాధానం చెప్పాడు. ఈ పదేళ్లు ఏం చేయకుండానే ఇంత సంపాదించావంటే ఏమైనా చేసి ఉంటే ఇంకా ఎంత సంపాదించే వాడివో అంటూ అందరి ముందు అఖిల్ పరువు తీశాడు. ఇలా అఖిల్ కి నటించటం రాదని అది ఇండైరెక్టుగా సెటైర్ వేశాడు. అఖిల్ మాత్రం ఎటువంటి రియాక్షన్ లేకుండా తెల్ల మొఖం వేసుకొని చూస్తున్నాడు.