Anasuya : డాన్స్ చేయమంటే కోతి గంతులేసింది అంటూ అనసూయ మీద సెటైర్ వేసిన బుడ్డోడు..!

Anasuya : అనసూయ బుల్లితెర మీద చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఎన్నో టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ తన యాంకరింగ్ తో పాటు తన అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా అనసూయ నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. అనసూయ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో, టీవీ షోలతో చాలా బిజీగా ఉంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అందమైన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం మా టీవీలో ప్రసారం కానున్న సూపర్ సింగర్ జూనియర్స్ అనే సింగింగ్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ షోలో అనసూయతో పాటు సుధీర్ కూడా యాంకర్ గా సందడి చేయనున్నాడు. మనో, చిత్ర, రెనీనా రెడ్డి , హేమచంద్ర ఈ షోకి జడ్జీలుగా వ్యవహరించనున్నారు. ఇటీవల ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో పిల్లలు చిచ్చర పిడుగుల్లా సుదీర్ , అనసూయ ను ఒక ఆట ఆడుకున్నారు.

ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ఒక బుడ్డోడు ఏకంగా అనసూయను ఆంటీ అనేసాడు. దీంతో అనసూయ హర్ట్ అయ్యి తెల్లమొహం వేసింది. రామ్మా చిలకమ్మా అంటూ చిరంజీవి గారి పాట పాడిన ఆ బుడ్డోడు పాట అయిపోయిన తర్వాత ఎవరి టీంలోకి వెళ్తావు అని అడగగా.. ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ల టీం లోకి వస్తాను అని అంటాడు. దీంతో అనసూయ డాన్స్ చేయగా ఆ బుడ్డోడు స్టేజ్ మీద నుండి బయటకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు సుదీర్ ఏమైంది ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగితే డాన్స్ చేయమంటే అక్క కోతి గంతులేసిందని మళ్ళీ అనసూయ మీద సెటైర్ వేస్తాడు. దీంతో సుధీర్ మాట్లాడుతూ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనటంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.