సినిమా పరిశ్రమలో నమ్మకాలు ఎక్కువ. ముహూర్తం చూసుకోకుండా కారు నుంచి కూడా అడుగుపెట్టని వాళ్లు ఉన్నారు. ఉదయాన్నే దుర్ముహూర్తం ఉంటే ఫోన్ ఎత్తని వాళ్లు ఉన్నారు. అయితే ఆ నమ్మకాలు మంచివా, మూఢ నమ్మకాలా అనేది వారి వ్యక్తిగతం. అలాగే సినిమా హిట్ కోసం గతంలో కొందరు హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ పేరులో అక్షరాలు మార్చుకోవటం, కొత్త పేరు యాడ్ చేసుకోవటం తెలిసినదే. అసలు పేరు వేరు, సినిమా పేరు వేరు ఉంటుంది.
అదే పద్దతిలో ఇప్పుడు వైవియస్ చౌదరి సైతం న్యూమరాలిజీ ప్రకారం..పేరులో ఓ కొత్త అక్షరం కలుపుకున్నారు. ఆ విషయం తెలియచేస్తూ ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం అంతటా చర్చనీయాంశమైంది. ఆయనేం పోస్ట్ పెట్టారో మీరు ఈ క్రింద చూడవచ్చు.
ఆయన తన పేరులో Extra గా ‘R’ ని జోడిస్తూ ‘yvs chowdar’R’y’ (YVS Chowdarry) గా మార్చుకున్నారు. చౌదరి అభిమానులు అదేంటి మీరు పేరు మారకముందు కూడా హిట్ కొట్టారు కదా అంటే…మార్పు’ అనేది ప్రకృతి సహజం. ‘మార్పు’ అనేది లేకపోతే ఈ సృష్టే లేదు, జీవితమే లేదు. కానీ.. మన జీవితంలోని ఎలాంటి మార్పు, కూర్పులకైనా అవగాహనతో కూడిన చేర్పు అవసరం అని నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ సున్నితంగా చెప్పారు. ఎనీహౌ..ఈ కొత్త పేరు మార్పుతో అయినా ఆయన మళ్లీ ఫామ్ లోకి రావాలని కోరుకుందాం.