అమీర్‌ఖాన్ తాను పోషించే పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటారన్న విషయం తెలిసిందే. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ పరాజయం తరువాత కొంత విరామం తీసుకున్న ఆయన తాజాగా లాల్‌సింగ్ చద్ధా చిత్రంలో నటిస్తున్నారు. 1994లో యాక్షన్ హీరో టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచిన ఓ వ్యక్తి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ యంగ్‌గా కనిపించనున్నారట. ఇందు కోసం ఆయన దాదాపు 20 కిలోల బరువు తగ్గారని తెలిసింది. ప్రత్యేక డైట్‌ని ఫాలో అవుతున్న ఆయన లాల్‌సింగ్ చద్దా పాత్ర కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్టు చిత్ర వర్గాల సమాచారం. సీక్రెట్ సూపర్‌స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వయాకమ్ 18 పిక్చర్స్‌తో కలిసి అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.