చెత్త మీడియా సునీల్ ని చంపేసిన విధం ఇదీ..

యూట్యూబ్ వచ్చాక మీడియా స్వరూపం పూర్తిగా మారిపోయింది. వ్యూస్ కోసం ఎంతకైనా దిగ జారిపోతున్నారు. … ఏం చేసైనా స‌రే.. వాళ్ల‌కు వ్యూస్ వ‌స్తే చాలు అనుకుంటున్నారు వాళ్లు. అందుకే ఎంత‌కు దిగ‌జార‌డానికైనా సిద్ధ‌మే అంటున్నారు. దానికోసం నైతిక విలువ‌లను కూడా తుంగ‌లో తొక్కేస్తున్నారు. లేకపోతే హాయిగా, క్షేమంగా ఉన్న సునీల్ మృతి చెందారని వార్త రాయటమేంటి…దానికి తాను క్షేమంగానే ఉన్నానని సునీల్‌ వివరణ ఇవ్వాల్సి రావటమేంటి..ఖర్మ కాకపోతే…

వివరాల్లోకి వెళితే.. సునీల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని ఓ వెబ్‌సైట్‌ తప్పుడు వార్తను రాసింది. దీన్ని చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ మేరకు సునీల్‌ ట్విటర్‌లో స్పందించారు. ఆ వార్తల్ని నమ్మొద్దని అభిమానుల్ని కోరారు. ‘అది తప్పుడు వార్త. నేను క్షేమంగా ఉన్నా. దయచేసి ఆ వార్తను నమ్మొద్దు’ అని సునీల్‌ ట్వీట్‌ చేశారు.

వ్యూస్‌ కోసం ఇలాంటి వార్తలు రాసే వార్ని శిక్షించాలని అభిమానులు కామెంట్లు చేశారు. ఇలాంటి ఘోరమైన వదంతులు రాయడం సరికాదని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని అన్నారు. సదరు వెబ్‌సైట్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అభిమానులు సునీల్‌ను కోరారు.

అసలు జరిగింది ఇదీ..

తెలుగు ఇండ‌స్ట్రీ బుల్లితెర న‌టుడు నందం సునీల్ మ‌ర‌ణించాడు. దాన్ని కొంద‌రు ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాసేసి యూ ట్యూబ్ ఛానెల్లో ప్ర‌మోట్ చేసుకున్నారు. ఆ రాతల్లో భాగంగా ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు అంటూ రాసేసరికి అంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. కొద్ది సేపటికి అస‌లు విష‌యం తెలుసుకుని సునీల్ కూడా వెంట‌నే త‌న ట్విట్ట‌ర్లో మ్యాట‌ర్ షేర్ చేసి.. ఇలాంటి అబ‌ద్ధ‌పు వార్త‌ల‌ను అస్స‌లు న‌మ్మ‌కండి అంటూ ట్వీట్ చేసాడు.