‎Sunil: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కమెడియన్ సునీల్ హీరోయిన్.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్!

‎Sunil: టాలీవుడ్ నటుడు, విలన్, కమెడియన్, సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సునీల్. కొన్ని సినిమాలలో నటుడిగా, కొన్ని సినిమాలలో కమెడియన్గా, మరి కొన్ని సినిమాలలో హీరోగా కూడా నటించి మెప్పించారు. పుష్ప లాంటి సినిమాలలో అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే సునీల్ కు బాగా గుర్తింపు దక్కింది మాత్రం కమెడియన్ పాత్రలోనే అని చెప్పాలి.

‎అద్భుతంగా కామెడీ చేస్తూ ఎంతోమందిని కడుపుబ్బ నవ్వించారు సునీల్. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కమెడియన్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు సునీల్. అందాల రాముడు సినిమాతో హీరోగా మారిన సునీల్ తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో మర్యాద రామన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మర్యాద రామన్న సినిమా విభిన్న కథతో తెరకెక్కింది.

‎ఈ సినిమాలో సునీల్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఆర్కా మీడియా పతాకంపై యార్లగడ్డ శోభు, దేవినేని ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. మర్యాద రామన్న సినిమాలో సునీల్‌కు జోడీగా హీరోయిన్ సలోని నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. హీరోయిన్ సలోని విషయానికి వస్తే.. ధన 51 సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు, కోకిల, బాస్, అలాగే మగధీర వంటి సినిమాలలో నటించి మెప్పించింది.

‎సునీల్ నటించిన మర్యాద రామన్న సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. తెలుగమ్మాయి, బాడీగార్డ్, అధినాయకుడు, రేసుగుర్రం, మీలో ఎవరు కోటీశ్వరుడు, మట్కా సినిమాల్లో నటించింది. అలాగే ఇప్పుడు ఆడపడదపా సినిమాలు చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అందులో గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది హీరోయిన్ సలోని. మర్యాద రామన్న సినిమాలో కంటే ఇప్పుడు మరింత అందంగా తయారయ్యిందని చెప్పాలి.