(ధ్యాన్)
`కీచక` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయవాడ బ్యూటీ యామినీ భాస్కర్. తెలుగు అమ్మాయిగా ఆమె ఇప్పుడు నాగశౌర్య సినిమా @ నర్తనశాలలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో యామినీ భాస్కర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..
* మీ గురించి చెప్పండి?
– నేను డిగ్రీ చదివా. మాది విజయవాడ. మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. నేను , అమ్మ, తమ్ముడు మాత్రమే ఉన్నాం. అమ్మ నాకు చాలా సపోర్టివ్. నేను అందంగా ఉన్నానని, సినిమాల్లో ట్రై చేయమని నేను టెన్త్ లో ఉన్నప్పుడు మా ప్రిన్సిపాల్ చెప్పారు. మా అమ్మకు కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రస్ట్ ఉండటంతో నేను నటనకు వచ్చాను. ఇన్‌ఫాక్ట్ మా నాన్న నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చి హీరోయిన్ చేయాలని అనుకునేవారట. సో ఇప్పుడు నాన్న కల నెరవేర్చినట్టు అవుతోంది.
* తెలుగమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు రావని అంటారుగా..?
– దీని గురించి నేనేం మాట్లాడాలి. నన్ను కాంట్రవర్సీల్లోకి లాగకండి. డబ్బులు పెట్టే ఎవరైనా తమ పాత్రలకు సూట్ అయ్యే అందమైన అమ్మాయిల కోసమే చూస్తుంటారు. ఈ సినిమాకు నేను ఆడిషన్స్ కి వచ్చినప్పుడు తెలుగు అమ్మాయిని అనే తీసుకున్నారు దర్శకుడు.
* సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా?
– తప్పకుండా ఉంది. నన్ను కూడా చాలా మంది కమిట్‌మెంట్ కోసం అడిగారు. కాకపోతే నేను లీనియన్స్ ఇస్తేనే కదా వాళ్లు నా జోలికి వస్తారు. నేను ఇవ్వలేదు.
* కీచక నుంచి ఇప్పటిదాకా మీకు అవకాశాలు రాలేదా?
– వచ్చాయి. తమిళంలో ఓ సినిమా చేశాను. మారుతి కాంపౌండ్‌లో భలే మంచి చౌక బేరము చేశాను. ఇప్పుడు నాగశౌర్య సినిమా @ నర్తనశాల చేశా.
* సినిమా ఇండస్ట్రీ ఏం నేర్పించింది?
– చాలానే నేర్పించింది. ఇంతకు ముందున్నట్టు ఇప్పుడు లేను. చాలా మారాను. చాలా నేర్చుకున్నాను. ఈ మార్పు నేను ఊహించనిది.