ఇన్నాళ్లూ వైయస్ జగన్ పదవిలో లేరుకాబట్టి ..ఎవరూ ఆయనతో తమ అనుబంధం గురించి మాట్లాడలేదు. ఈ రోజు ప్రతీ వాళ్లు తమకు జగన్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పడం మొదలెడుతున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సైతం తనకు జగన్ తో ఉన్న బంధం గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ సందర్భంలో జగన్ తమ ఇంటికి వచ్చిన విషయాన్ని కూడా వినాయక్ రివీల్ చేసారు.
వైయస్ జగన్ మాట్లాడుతూ..”ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన జగన్ గారికి శుభాకాంక్షలు. మా నాన్నగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారిని అభిమానించేవారు. రాజకీయాల్లో మా నాన్నగారు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మా తమ్ముడు సురేంద్ర వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. నేనూ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిశా. మా అమ్మ చనిపోయినప్పుడు మా ఇంటికి జగన్ మోహన్ రెడ్డిగారు వచ్చారు.
ఒక సమయంలో రవీందర్ రెడ్డి గారు( వైఎస్ బావమరిది – యోగి నిర్మాత) ‘పోటీ చేద్దువుగానీ’ అని అన్నారు. కానీ అంత శక్తి లేక వెనక్కి తగ్గా. అప్పట్లో మా అమ్మ కూడా అందుకు ఒప్పుకోలేదు. వద్దురా.. మీ నాన్న రాజకీయాల్లో తిరిగి డబ్బు పోగొట్టుకోవడంతో మీ చిన్నప్పుడు మీకు ఏమీ చేయలేకపోయాం. అందుకే మీ పిల్లలు ఎదిగాక ఆలోచిద్దాం. పిల్లలను సెటిల్ చేసిన తర్వాత మీ ఇష్టాలన్నీ తీర్చుకోండి. ఇప్పుడు వద్దు అని ఎడ్యుకేట్ చేసింది. అందుకే వద్దని చెప్పా. భవిష్యత్తులో ఆలోచిస్తా” అని వినాయక్ తెలిపారు.