తాత , తండ్రి పేరు అఖిల్ నిలబెడతాడా ..?

అక్కినేని అఖిల్ ఇప్పుడు మిస్టర్ మజ్ను గా రాబోతున్నాడు . ఇంతకూ ముందు చేసిన అఖిల్ , హల్లో చిత్రాలు విజయవంతం కాలేదు . దీంతో తండ్రి నాగార్జున ఎలాగైనా తన రెండవ కుమారుడు అఖిల్ సినిమా విజయవంతం చెయ్యాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు . బీవీఎస్ ప్రసాద్ ,వెంకట్ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా నిర్మిస్తున్నాడు .

“లైలా మజ్ను “పేరుతో 1949లో తాత అక్కినేని నాగేశ్వర రావు ఓ చిత్రం చేశాడు . అది ఘన విజయ సాధించింది . రామకృష్ణ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భానుమతి నాయికగా నటించింది . ఈ సినిమాను భానుమతి స్వయంగా నిర్మించింది . 1987లో తండ్రి అక్కినేని నాగార్జున “మజ్ను”పేరుతో ఓ చిత్రం చేశాడు . దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించి నిర్మించాడు . ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా రజని నటించగా మూన్ మూన్ సేన్ ఓ ప్రత్యేక పాత్రలో నటించింది . ఈ సినిమా కూడా విజయ వంతమై నాగార్జున కు పేరు తెచ్చిపెట్టింది .

మరి తాత నాగేశ్వర రావు “లైలా మజ్ను”, తండ్రి నాగార్జున నటించిన “మజ్ను ” చిత్రాలు హిట్ అయ్యాయి . ఇప్పుడు అఖిల నటిస్తున్న “మజ్ను ” సినిమా కూడా హిట్ అవుతుందని నాగార్జున కుటుంబం నమ్ముతుంది .

ఈ మధ్యనే నాగ చైతన్య నటించిన ” శైలజా రెడ్డి అల్లుడు “సినిమా బాగా నిరాశ పరిచింది . ఈ షాక్ నుంచి ఇంకా వారు తేరుకోలేదు . నాగార్జున, నాని నటించిన “దేవదాస్” సినిమా తయారవుతుంది . ఈ చిత్రంలోనాగార్జున తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కన్నా గ్లామర్ గా వున్నాడని అంటున్నారు .ఏమైనా ఇది నాగార్జునకు వ్యక్తి గతంగా తృప్తిని ఇవ్వవచ్చు కానీ కొడుకులను ప్రమోట్ చేసుకులేక పోతున్నానని భాధ పోదు కదా ?