నటసింహా నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతారా? మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ని మీటయ్యే అరుదైన ఛాన్స్ మిస్సయ్యింది. ఇండస్ట్రీ తరపున ప్రతినిధిగా బాలయ్యకు ఛాన్స్ లేకుండా పోయింది. ఆ ఛాన్స్ తనకు ఇవ్వకుండా మెగాస్టార్ చిరంజీవి కొట్టేశారని బాలయ్య స్వయంగా ఆరోపించారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ని కలిసే అవకాశం మాత్రం బాలయ్యకు ఉంది. మరి ఆయన వెళ్లి కలుస్తారా? పరిశ్రమ సమస్యలపై మాట్లాడతారా? అంటే… ప్రస్తుతానికి అంతా సస్పెన్స్.
9 జూన్ 3 గంటలకు ఏపీ సీఎం జగన్ తో ఇండస్ట్రీ ప్రముఖులు భేటీ అవ్వనున్నారు. మీటింగ్ కోసం అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారట. ఈ భేటీలో మెగాస్టార్ చిరంజీవి- సి.కళ్యాణ్- తమ్మారెడ్డి భరద్వాజా సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిసింది. నాగార్జున- కృష్ణ వంటి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందట. ఇండస్ట్రీ సమస్యలు సహా పలు అంశాలపై ముచ్చటించనున్నారని తెలుస్తోంది.
అయితే ఈసారి పాత తప్పును రిపీట్ చేయకుండా మెగా బాస్ స్వయంగా నందమూరి బాలకృష్ణను ఆహ్వానిస్తారట. ఆయన విషయంలో పొరపాటు జరగకుండా సీఎం జగన్ మీటింగ్ కి పిలవబోతున్నారట. ఒకవేళ చిరు ఆహ్వానిస్తే బాలయ్య వస్తారా రారా? అన్నదే ఇప్పుడు సస్పెన్స్. గౌరవంగా మీటింగుకి అటెండయ్యి పరిశ్రమ తరపున తన స్వరం వినిపిస్తారా? తేదేపా ఎమ్మెల్యే కాబట్టి వైసీపీ ముఖ్యమంత్రిని కలవడం కుదరదు.. ససేమిరా! అంటూ బింకం చూపిస్తారా? అయినా మొన్న కేసీఆర్-తలసాని భేటీకి పిలవకుండా అవమానించి ఈసారి పిలిస్తే వస్తానా.. అంటూ బిర్రబిగుసుకుపోతారా? అంటూ ఇన్ సైడ్ గుసగుస మొదలైంది. అప్పుడు అవాయిడ్ చేసినా ఇప్పుడు పిలిస్తే వస్తారా రారా? అన్నదే డైలమా.