బిగ్ బాస్ 4 : ఆ ముగ్గురి లో చీఫ్ గెస్ట్ ఎవరు ?

బిగ్ ‌బాస్ నాలుగో సీజ‌న్ ఫైన‌ల్‌కి వ‌చ్చేసింది. ఈ వారాంతంలో బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు ఈ సీజన్ విజేత‌ను ప్ర‌క‌టించనున్నారు. ఇక ప్ర‌తి సారి లాగే ఈ సారి ఓ స్టార్ హీరో బిగ్‌బాస్ గ్రాండ్ ఫైన‌ల్‌కి రానున్నారు. అయితే ఆ వ‌చ్చేది ఎవ‌ర‌న్న చ‌ర్చ ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. టాలీవుడ్ వ‌ర్గాల ప్ర‌కారం ఈ సారి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు బిగ్‌ బాస్‌ లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Nagarjuna About Records Of Bigg Boss 4 Telugu

ఈ సీజ‌న్ ఫైన‌ల్‌కి చిరంజీవి, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్ పేర్లను నిర్వాహ‌కులు ప‌రిశీలిస్తున్న‌ట్లు టాక్ న‌డిచింది. వీరిలో ఎన్టీఆర్ రాలేన‌ని చెప్పాశార‌ని స‌మాచారం. ఇక చిరంజీవి కూడా ఆచార్య షూటింగ్‌లో ఉండ‌టంతో బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలేకు దాదాపుగా రాక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు మ‌హేష్ బాబుతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు టాక్.

మ‌రో నాలుగు రోజుల్లో బిగ్‌ బాస్ గ్రాండ్ ఫినాలే ఉండ‌గా.. దానికి మ‌హేష్‌ని ఎలాగైనా ఒప్పించాల‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. అటు కంటెస్టెంట్‌ల‌కే కాదు ఇటు బిగ్‌ బాస్ వీక్ష‌కుల‌కు ఇది పెద్ద శుభ‌వార్తే. అలాగే మ‌హేష్‌, నాగార్జున చేసే హ‌డావిడి అభిమానుల‌కు పండుగ వాతావ‌ర‌ణాన్ని తీసుకొస్తోంది. చూడాలి ఎన్టీఆర్ , మెగాస్టార్ , మహేష్ లలో ఎవరు వస్తారో

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles