2020 సంక్రాంతి వారియ‌ర్స్ ఎవ‌రెవ‌రో తెలుసా?

2020 సంక్రాంతి డ‌జ‌ను సినిమాలు రిలీజ్

2020 సంక్రాంతికి ఇప్ప‌టికే న‌లుగురు అగ్ర హీరోల సినిమాలు బ‌రిలో ఉన్నాయి. సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న‌ `స‌రిలేరు నీకెవ్వ‌రు`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న `అల వైకుంట‌పుర‌ములో` చిత్రాల్ని సంక్రాంతి 2020 బ‌రిలో ఖాయం చేశారు. వీళ్ల‌తో పాటే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న భారీ చిత్రం `ద‌ర్బార్`ని సంక్రాంతి 2020 కే త‌మిళ్, తెలుగులో రిలీజ్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించేశారు. వీళ్ల‌కు తోడుగా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ , కే.ఎస్.రామారావు కాంబినేష‌న్ సినిమాని సంక్రాంతికే తెస్తార‌న్న ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు కింగ్ నాగార్జున బంగార్రాజు సంక్రాంతికే రావాల్సి ఉండ‌గా ఈ ప్రాజెక్ట్ కాస్త ఆల‌స్య‌మ‌వుతోంది. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర‌వేగంగా పూర్తి చేసి సంక్రాంతి నాటికి తెస్తారా? అన్న‌ది చూడాలి.

<

p style=”text-align: justify”>మ‌రోవైపు క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న ఎంత మంచి వాడ‌వురా చిత్రాన్ని సంక్రాంతికే రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. శ‌త‌మానం భ‌వతి ఫేం స‌తీష్ వేగేష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. మెహ్రీన్ నాయిక‌. గోపీసుందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ఇండియా అధినేత ఉమేష్ గుప్త సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్ మారుతి కాంబినేష‌న్ మూవీ ప్ర‌తి రోజు పండ‌గే సంక్రాంతి బ‌రిలోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. వీళ్ల‌కు తోడు శ‌ర్వానంద్ శ్రీ‌కారం చిత్రాన్ని సంక్రాంతి 2020 కే రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర‌హాలో చ‌క్క‌ని కంటెంట్ ఉన్న చిత్ర‌మిద‌ని చెబుతున్నారు. అలాగే నాగ‌చైత‌న్య‌, అఖిల్ లాంటి స్టార్లు సంక్రాంతి రేసులోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న మాటా వినిపిస్తోంది. ఓవ‌రాల్ గా సంక్రాంతి 2020 కి డ‌జ‌ను వ‌ర‌కూ సినిమాలు బ‌రిలో ఉన్నాయ‌ని స‌న్నివేశం చెబుతోంది. చిన్నా పెద్దా హీరోల సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది.