IPL-2020, 55th Match : బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో అలవోకగా ఢిల్లీ విజయం… ప్లే ఆఫ్స్ లో బెంగుళూరు మరియు ఢిల్లీకి చోటు

Delhi Capitals won by 6 wickets
Delhi Capitals won by 6 wickets
Delhi Capitals won by 6 wickets

ఐపీఎల్-2020: అబుదాబి వేదికగా బెంగళూరుతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకి ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసుకుంది. మ్యాచ్‌లో బెంగళూరు ఓడినప్పటికీ.. కోల్‌కతాతో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ ఉండటంతో మూడో ప్లేఆఫ్ బెర్తుని దక్కించుకుంది. బెంగళూరు, కోల్‌కతా 14 పాయింట్లతో వరుసగా 3, 4 స్థానాల్లో ఉండగా.. కోల్‌కతా నెట్‌ రన్‌రేట్ -0.214తో పోలిస్తే బెంగళూరు -0.172 మెరుగ్గా ఉంది. ఇక చివరి ప్లేఆఫ్ బెర్తు రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నిలవగా.. మంగళవారం షార్జా వేదికగా ముంబయి ఇండియన్స్‌తో హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిస్తే..? నేరుగా ప్లేఆఫ్‌కి అర్హత సాధించనుండగా.. ఓడితే కోల్‌కతా‌కి ఆ ఛాన్స్ దక్కనుంది.

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ‌‌ను బ్యాటింగ్‌కు అహ్వనించింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టుగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ.. ప్రత్యర్థికి 153 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్ దేవదూత్‌ పడిక్కల్‌(50; 41 బంతుల్లో 5 ఫోర్లు) పాటు విరాట్‌ కోహ్లి(29; 24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), డివిలియర్స్‌(35; 21 బంతుల్లో 1 ఫోర్‌, 2సిక్స్‌లు) రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు వికెట్లు సాధించగా, రబడా రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌కు ఒక్క వికెట్‌ దక్కింది.

బెంగళూర్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని క్యాపిటల్స్ సులభంగా చేధించింది.ఓపెనర్‌ శిఖర్‌ ధావన్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించడం,రహానే కూడా దాటిగా ఆడడంతో ఆర్సీబీపై విక్టరీ నమోదు చేసుకుంది. ఓపెనర్‌ పృథ్వీషా 9 పరుగులకే ఔటైనా ధావన్,రహానే రన్‌రేట్‌ పడిపోకుండా బ్యాటింగ్‌ కొనసాగించారు. బలపడుతున్న వీరిద్దరి భాగస్వామ్యాన్ని దూబె వీడదిశాడు. శిఖర్‌ ధావన్ ( 54; 41 బంతుల్లో 6 ఫోర్లు) షాబాజ్‌ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి దూబె చేతికి చిక్కాడు. తర్వాత రహానే,కెప్టెన్ శ్రేయస్ ఇన్నింగ్స్ ముందుండి నడిపించారు. రహానే ( 60; 46 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్) ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఇక దాటిగా ఆడే క్రమంలో శ్రేయస్‌,రహానే ఔటయ్యారు. అప్పటికే ఢిల్లీ పటిష్ట స్ధితిలో ఉండడంతో మిగితా పనిని పంత్,స్టాయినిస్‌ పూర్తి చేశారు. దీంతో ఢిల్లీ 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరింది. ఓడినా మెరుగైన రన్‌రేటుతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు చేరింది. నెట్‌ రన్‌రేట్‌ కోల్‌కతా కన్నా ఎక్కువగా ఉండడంతో ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెబుల్‌లో టాప్ 4 స్థానంలో నిలుస్తోంది. సన్‌రైజర్స్,ముంబైపై గెలిచినా ఆర్సీబీకి వచ్చే ఇబ్బంది ఏమి లేదని చెప్పాలి.