బిగ్ బాస్ 4: ఆ 40 మందిలో న‌లుగురు హీరోలెవ‌రు?

                                            గుహ‌లో ఈసారి హీరోలు ఎవ‌రెవ‌రు?

`బిగ్ బాస్` సీజ‌న్ 4 కి టైమ్ వ‌చ్చింది. ఈసారి ఇంటి స‌భ్యుల్లో సంద‌డి చేసేది ఎవ‌రెవ‌రు? అంటే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈసారి న‌లుగురు యువ‌హీరోలు ఆ న‌ల‌భై మందిలో ఉంటార‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రెవ‌రు ఆ న‌లుగురిలో ఉన్నారు? అంటే..

ఆర్.ఎక్స్ 100 ఫేం కార్తికేయ, గుంటూరు టాకీస్ ఫేం సిద్ధు జొన్నలగడ్డ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సుధాక‌ర్ కోమాకుల, గ‌రుడ‌వేగ ఫేం అదితి అరుణ్ లను బిగ్ బాస్ నిర్వాహ‌కులు సంప్ర‌దించార‌ట‌. వీళ్లంతా ఆల్మోస్ట్ ఖాయ‌మైన‌ట్టేన‌న్న‌ది గుస‌గుస‌.

వీళ్లే కాదు.. ఇప్ప‌టికే పాపుల‌ర్ అయిన ప‌లువ‌రు సీనియ‌ర్ నాయిక‌లు .. జూనియ‌ర్ బ్యూటీస్ కూడా ఇంట్లో సంద‌డి చేస్తార‌ని ఈసారి బిగ్ బాస్ మ‌రింత రంజుగా త‌యారు చేయాల‌ని స్టార్ మావాళ్లు ప్ర‌తిదీ ప‌క‌డ్భందీగా ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది. ఇక తొంద‌ర్లోనే మొద‌లెట్టేస్తార‌ట‌. అన్న‌ట్టు ఈసారి హోస్ట్ ఎవ‌రు అన్న‌ది కూడా ప్ర‌క‌టించాల్సి ఉంది.