వరదల్లో కేరళ అతలాకుతలం.. ఆదుకునేదెవరు?
ఉప్పెనలు .. వరదల వేళ టాలీవుడ్ స్టార్ల స్పందన ప్రతిసారీ ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంతకుముందు చెన్నయ్ ని వరదలు ముంచెత్తినప్పుడు టాలీవుడ్ స్టార్లు స్పందించిన తీరును.. 2017లో కేరళను వరదలు ముంచేసినప్పుడు మన స్టార్లు స్పందించిన తీరును మర్చిపోలేం. సినీ స్టార్లు లక్షల్లో విరాళాలు ప్రకటించారు. కేవలం టాలీవుడ్ నుంచే కోట్లలో విరాళాలు వరద బాధితులకు ప్రకటించారు. సీఎం నిధికి విరాళాల విషయంలో టాలీవుడ్ స్టార్లను చూసి నేర్చుకోవాలని మలయాళీ స్టార్లకు అక్కడ మంత్రి వర్యులు సూచించడం అప్పట్లో సంచలనమైంది.
<
p style=”text-align: justify”>అయితే ల్యాండ్ ఆఫ్ గాడ్స్ గా చెప్పుకునే కేరళను మరోసారి పెద్ద ఎత్తున వరదలు ముంచెత్తడం చూస్తున్నదే. 100 మంది పైగా మృత్యువాత పడ్డారని వార్తలొచ్చాయి. మరోవైపు ఇరుగు పొరుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విరాళాల్ని ప్రకటిస్తున్నారు. అయితే సినీస్టార్ల నుంచి ఇప్పటివరకూ సరైన స్పందన లేదు. టాలీవుడ్ నుంచి తొలిగా సంపూర్ణేష్ బాబు స్పందించి విరాళం ప్రకటించారు. తాజాగా కోలీవుడ్ స్టార్లు సూర్య, కార్తీ సోదరుల 10లక్షల విరాళం ప్రకటించారు. ఇంకా పలువురు స్టార్లు స్పందించాల్సి ఉంది. అయితే ప్రతిసారీ మేమున్నాం! అంటూ ఆదుకునే టాలీవుడ్ అగ్ర హీరోలు ఇప్పటివరకూ కేరళ వరదలపై స్పందించినట్టు కనిపించలేదు. మలయాళంలో అల్లు అర్జున్ కు ఉన్న స్టార్ డమ్ దృష్ట్యా అతడి నుంచి సాయం ఎప్పుడూ ఉంటుందనడంలో సందేహం లేదు. గతంలోనూ అల్లు అర్జున్ భారీ మొత్తంలో కేరళ బాధితులకు విరాళం అందించారు. మరోసారి మెగా ఫ్యామిలీ సహా నందమూరి హీరోలు, మంచు హీరోలు, దగ్గుబాటి, అక్కినేని హీరోలు స్పందిస్తారే భావిస్తున్నారు. ప్రకటన వెలువడే వరకూ కాస్త వేచి చూడాల్సిందే.