కొన్ని సినిమాలు కుటుంబంతో కలిసి చూడగలిగేవి ఉంటేవి. మరికొన్ని ఒక్కరే ఒంటిరిగా వెళ్లి ఎంజాయ్ చేసేవి ఉంటాయి. రెండో కోవకు చెందిన చిత్రం `ఆర్ఎక్స్100`. అయితే తన తల్లిని తీసుకుని ఈ సినిమాకు వెళ్లక తప్పలేదు పాయిల్ రాజపుత్. `ఆర్ఎక్స్100` లో హీరోయిన్ గా చేసిన ఆమె ఆ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్లలో నటించి సంచలనం సృష్టించింది. తల్లితో చూస్తున్నప్పుడు ఆ ఎక్సపీరియన్స్ ఎలా ఉంది..ఇబ్బంది పడ్డావా అంటూ ఆమెను అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు జవాబులిచ్చి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.
“ఆర్ఎక్స్100` సినిమాను మీ అమ్మతో కలిసి చూసినపుడు ఆమె ఫీలింగ్ ఏమిటి` అని పాయల్‌ను ఓ నెటిజన్ ప్రశ్నిస్తే… దీనికి పాయల్ స్పందిస్తూ.. `నేను మా అమ్మతో కలిసి `ఆర్ఎక్స్100` సినిమా చూశాను. హీరోతో సన్నిహితంగా ఉండే సీన్స్ వచ్చినపుడు కొంచెం ఇబ్బంది పడ్డా. అయితే ఆమె మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో భాగంగానే చూసింది` అని సమాధానం చెప్పింది.
అలాగే మరో అభిమాని `మీ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయ్యండి` అని అడిగాడు. దానికి స్పందించిన పాయల్.. `ఇప్పుడు కాదు. ప్రస్తుతం బరువు తగ్గడానికి కొన్ని వర్కవుట్లు చేస్తున్నాను. మంచి ఆకృతి వచ్చిన తర్వాత బికినీ ఫోటోలు పోస్ట్ చేస్తాన`ని చెప్పింది.