వరుణ్ తేజ్ పై అంత పెద్ద బెట్టింగా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ నిర్మించిన వాల్మీకి ఈనెల 20న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ విషయంలో సందిగ్ధత నెలకొంది. ఓవైపు చిత్రయూనిట్ ప్రచారంతో హడావుడి చేస్తున్నా.. దీనిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అయితే రిలీజ్ తేదీ విషయమై చిత్రయూనిట్ ధీమాగా ఉందని తెలుస్తోంది. కోర్టుల్లో అన్ని సమస్యల్ని పరిష్కరించుకుని వాల్మీకి బోయల మెప్పు పొందే చిత్రమవుతుందని హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
25 కోట్ల బిజినెస్ అంటే ఆషామాషీనా?
తాజాగా వాల్మీకి ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు తెలిశాయి. నైజాం-7.4కోట్లు, సీడెడ్-3.35కోట్లు, ఆంధ్రా-9 కోట్లు .. ఏపీ తెలంగాణ ఓవరాల్ గా 19.75 కోట్ల బిజినెస్ పూర్తి చేశారు. కర్నాటక రెస్టాఫ్ ఇండియా- 1.50 కోట్ల మేర బిజినెస్ పూర్తవ్వగా, అమెరికాలో 2.2 కోట్ల బిజినెస్ చేశారు. అమెరికాయేతర దేశాల నుంచి మరో 80లక్షల బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ బిజినెస్ వ్యవహారం చూస్తుంటే వరుణ్ అంత పెద్ద హిట్టందుకోవాల్సి ఉంటుంది. మెగా వారసుడిగా కెరీర్ ప్రారంభించిన వరుణ్ తేజ్ తన రేంజును అంతకంతకు పెంచుకుంటుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
40 కోట్ల క్లబ్ నెక్ట్స్ టార్గెట్
ఇప్పటికి 10 కోట్ల రేంజు నుంచి 25 కోట్ల రేంజుకు ఎదిగాడు. వాల్మీకితో మాస్ లో మాసివ్ హిట్టు కొట్టి తదుపరి 30-40 కోట్ల రేంజుకు ఎదగాలన్నది మెగా హీరో వరుణ్ తేజ్ టార్గెట్ అని తెలుస్తోంది. ఇప్పుడున్న హీరోల్లో నాని- దేవరకొండ మాత్రమే ఆ స్థాయి వసూళ్లను తేగలుగుతున్నారు. ఆ క్లబ్ లో అడుగు పెట్టాలంటే వరుణ్ ష్యూర్ షాట్ హిట్ కొట్టాల్సి ఉంటుంది. వాల్మీకి పోస్టర్లు.. టీజర్.. ట్రైలర్ తో హైప్ పెరిగింది. అయితే ఇది వసూళ్లకు ఎంతగా కలిసొస్తుంది? ఓపెనింగులకు వర్కవుటవుతుందా లేదా? అన్నది చూడాలి.