(సూర్యం)
కాన్సెప్టులో ఏదో ఒక విభిన్నత ఉండాలి. అలాగే సినిమా పోస్టర్, ట్రైలర్స్ లోనే సృజనాత్మకత చూపించాలి..లేకపోతే ఓపినింగ్స్ ఉండవు..జనాలు పట్టించుకోరు. ఓపినింగ్స్ లేకపోతే సినిమాలో ఎంత గొప్ప మ్యాటర్ ఉన్నా రెండో రోజుకు తిరిగు ప్రయాణం పెట్టుకోవాల్సిందే.
ఈ విషయం జీవా హీరోగా రెడీ అవుతున్న గొరిల్లా టీమ్ బాగానే బుర్రకెక్కించుకుంది. అందుకే … తమ టాలెంట్ ని ఉపయోగించి ఓ ఫన్నీ పోస్టర్ ని రెడీ చేసి వదిలింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
హీరో జీవాను నన్ గెటప్ లో చూపెడుతూ…గొరిల్లాకు స్టైలిష్ కళ్లద్దారు పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో అదే.
ఇక ఈ సినిమా తెలుగులో కూడా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంది . దానికి కారణం గతంలో జీవా నటించిన చిత్రాలు ఇక్కడా బాగానే వర్కవుట్ అవటం…అలాగే ..ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న షాలిని పాండే కు తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ రావటం. ఇక ఈ సినిమాకు డాన్ శాండీ డైరక్షన్ చేస్తున్నాడు.
ఈ సినిమా మరి కామెడీగా నవ్విస్తుందో..అసలు గొరిల్లాకు , ఈ నన్ గెటప్ కు లింకేంటో తెలుసుకోవాలనే ఆసక్తి రేపుతోంది. యంగ్ హీరో ఇలా నన్ గా కనిపించటం తో ఇదో చర్చనీయాంశంగా మారింది. అదే కదా..ఈ సినిమా టీమ్ కోరుకునేది.