ఆపరేషన్ బి అనేది ఉందా, దాని వెనక అసలు రహస్యమేమిటి?

(వి.శంకరయ్య)

 
ఆపరేషన్ గరుడ పోయింది. ఇప్పుడు తెరపైకి ఆపరేషన్ బి వచ్చింది. సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆపరేషన్ బి తెరమీదకు తెచ్చారు. ఆపరేషన్ గరుడఆపరేషన్ బి లోని అంశాలు కాసేపు పక్కన బెడితే ఢిల్లీ స్థాయిలో అదీ ప్రధాన మంత్రి ఆఫీసు లెవల్ లో రూపొందే కుట్ర పథకాలు తొలుత ప్రత్యక్ష రాజకీయాలతో ఎ మాత్రం సంబంధంలేని సినిమా వారే పసి గడుతునారంటే వారికే అందరి కన్నా ముందు గా చేరు తున్నాయంటే ఇందులో పలు మతలబులు వున్నాయనే సందేహం ఎవరికై కలుగుతుంది. ఎపిలో తలలు పండి ఢిల్లీ రాజకీయాలతో నిత్య సంబంధాలు గల నేతలు వీరి ముందు ఎందుకు పనికి రాకుండా పోయారు?

టిడిపి ప్రభుత్వ ప్రతి నిధులు పార్టీ ప్రతినిధులతో పాటు పార్లమెంటు సభ్యులు అచేతనంగా వున్నారా? లేదా తుదిగా ఎవరికైనా కలిగే సందేహమేమంటే టిడిపి పథకం ప్రకారం ఈ ఆపరేషన్ లను వండి ఒక్కొక్కరి నుండి ప్రజల ముందుకు తీసుకు వస్తోందా? పరిణామాలు పరిశీలించితే ఇదే వాస్తవమని భావించాలిసి వస్తోంది. దాదాపు ఆపరేషన్ గరుడకు కాలం చెల్లింది. ఇంకా దానిని సాగలాగి నందుకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే విపక్షనేత జగన్ పై జరిగిన దాడి అయితే గియితే ఏ దైనా స్వతంత్ర సంస్థ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించితే ఆపరేషన్ గరుడ ప్రచార కర్తకు తిప్పలు తప్పవు. ఈ ప్రమాదం పొంచి వున్నందున రోజు రాజకీయ రన్నింగ్ కామెంటరీ కి సరి కొత్త పథకం కావాల్సి వచ్చి ఆపరేషన్ బి తెర మీద కు తెచ్చారని భావించిక తప్పదు. వాస్తవంలో ఈ లాంటి పథకమే నిజంగా రూపింపబడి వుంటే టిడిపి యంపి లు ఎందుకు పసి గట్ట లేక పోయారు? . ఒక సినిమా నిర్మాత ముందు వీరంతా అంత బలహీనులా?

అసలు సమస్య అదికాదు. టిడిపి యంపి లులేదా పార్టీ నేతలు ఈ లాంటి పథకాలను బహిరంగ పరిచితే అందులోనీ వివరాలను విపక్షాల ఎదురు దాడికి వివరించాలసి వుంటుంది. అదే ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేని వారైతే ఈలాటి ఇబ్బంది వుండదు. ఫలితంగా మరో అనుకూలం వుంటుంది. బిజెపి కేంద్ర ప్రభుత్వం పై రాళ్లు వేయదలచి నప్పుడు ప్రచారం లోనికి వచ్చిన ఈ పథకాలను ఉపయోగించు కొనే వెసులుబాటు వుంటుంది. ఇంతకీ గమనార్హమైన అంశమేమంటే ఈ సమాచారం కామన్ మాన్ చెప్పారని ఆయన తేల్చేశారు. అంటే గాలికి పోయే పిండి కృష్ణార్పణం అన్నచందంగా తయారైంది.

ఇక ఆపరేషన్ బి విశేషం పరిశీలన చేస్తే ఎపిలో ఈ నాలుగేళ్ల కాలంలో బాగా సంపాదించిన కాంటాక్ట్ర లు పారిశ్రామిక వేత్తలపై దాడులు జరుగనున్నాయనేది అసలు సారాంశం.? అక్రమంగా సంపాదించిన వారి పై దాడులు జరిగితే ఎపి పై పగ బట్టి నట్లు ఎందుకు భావించాలి.? వారు తప్పు చేయనపుడు టిడిపి కి చెందిన వారైనా ఎందుకు భయపడాలి.? భరద్వాజ గారు మరో వాదన తెచ్చారు. అన్ని పార్టీలుకు చెందిన వారిపై దాడులు జరగాలని అన్నారు. బహుశా ఆయనకు తెలిసి వుండక పోవచ్చు. ఏ పార్టీ అధికారంలోని కోస్తే ఆ పార్టీ కొమ్ము కాయడం పారిశ్రామిక వేత్తలు కాంట్రాక్టర్లు విధానం. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన వారు టిడిపి హయాంలో ముఖ్య నేతలుగా లేరా? ఆ మాట కోస్తే మునుపటి టిడిపి కి ఇప్పుడు టిడిపికి సంబంధం వుందా? ఇప్పుడు టిడిపి లో అందరూ పారిశ్రామిక వేత్తలు కాంట్రాక్టు రులే. అందుకే భరద్వాజ గారు చెప్పిన ప్రకారం దాడులు జరిగితే టిడిపి నేతలే గురి అవుతారు.

ఎపి యెడల కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక వైఖరి వేరు. నాలుగేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభించిన దుర్మార్గపు విధానాలను ప్రభుత్వ వ్యతిరేకతనుదాచుకొనేందుకు ఇలాంటి ప్రచారం మొదలెట్టారు

 

(వి.శంకరయ్య, రాజకీయ వ్యాఖ్యాత, ఫోన్   9848394013)