అల‌నాటి శృంగార తార‌పై వెబ్‌సిరీస్‌

(ధ్యాన్)

కైపు క‌ళ్ల‌తో, అంద చందాల‌తో 1980 ద‌శకంలో సినీ ప్రేక్ష‌కుల‌ను మైమ‌ర‌చిపోయేలా చేసిన న‌టి సిల్క్ స్మిత‌. ఐటెమ్‌బాంబ్‌గా సిల్క్ పేరు మారు మ్రోగింది. అప్ప‌ట్లో చిరంజీవి, ర‌జ‌నీకాంత్ స‌హా ద‌క్షిణాదిన అంద‌రి అగ్ర హీరోల సినిమాల్లో ఐటెమ్‌సాంగ్స్‌లోనూ, కీల‌క‌పాత్ర‌ల్లోనూ న‌టించి అల‌రించింది.

ఈమె జీవిత చ‌రిత్ర‌ను ఆధారంగా చేసుకుని మిలాన్ లూథారియా ద‌ర్శ‌క‌త్వంలో డ‌ర్టీపిక్చ‌ర్ పేరుతో స్మిత బ‌యోపిక్ రూపొందింది. విద్యాబాల‌న్ స్మిత‌గా న‌టించి మెప్పించారు. సినిమా సూప‌ర్‌హిట్ అయింది. అయితే తాజాగా ఈమె జీవిత చ‌రిత్ర‌ను వెబ్ సిరీస్ రూపంలో తీసుకురాబోతున్నారు.

క‌బాలి, కాలా వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు పి.రంజిత్‌ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు. ముంబైకి చెందిన ఓ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించ‌నుంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.