క్యారెక్ట‌ర్ ఎవ‌రిదో తెలుసు గానీ..యాక్ట‌ర్ ఎవ‌రో చెప్పగ‌ల‌రా?

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న‌దెవ‌రో ఇట్టే చెప్పేయ‌వ‌చ్చు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అని. బ‌ట్- ఆ క్యారెక్ట‌ర్‌ను పోషించిన న‌టుడిని మాత్రం అంత ఈజీగా గుర్తు ప‌ట్ట‌లేం క‌దా! అత‌నే బాలీవుడ్ న‌టుడు వివేక్ ఓబెరాయ్‌. క్రిష్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కూ ప‌రిచితుడే.

అంతేనా- సంక్రాంతికి విడుద‌ల కాబోతున్న `విన‌య విధేయ రామా`లో మెయిన్ విల‌న్‌గా న‌టించాడు వివేక్‌. న‌రేంద్ర‌మోడీ జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటోన్న మూవీ ఇది. టైటిల్ కూడా అదే. `పీఎం న‌రేంద్ర‌మోదీ`. `దేశ‌భ‌క్తే నా శ‌క్తి` అనేది దీని ట్యాగ్‌లైన్‌.

ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. `మేరీకోమ్` బ‌యోపిక్‌ను తీసింది ఈ ద‌ర్శ‌కుడే. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ‌ణ‌విస్ ఆవిష్క‌రించారు. లెజెండ్ గ్లోబల్ స్టూడియో బ్యాన‌ర్‌పై వివేక్ ఓబెరాయ్ తండ్రి, సీనియ‌ర్ న‌టుడు సురేష్ ఓబెరాయ్‌, సందీప్ సింగ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అన్నింటికంటే స్పెష‌ల్ ఏమిటంటే- 23 భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లకు కొద్దిరోజుల ముందు ఈ సినిమా విడుద‌ల కావొచ్చు. ఎన్నిక‌ల ల‌బ్ది కోస‌మే ఈ మూవీ రూపుదిద్దుకుంటోంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యమే.