బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా పదేళ్ల క్రితం తన పట్ల జరిగిన ఓ దారుణమైన ఘటన గురించి మీడియా ముందు వెల్లడించిన చేసిన సంగతి తెలిసిందే. నానా పటేకర్ తనను లైంగికంగా వేధించారని ఆమె చెప్పింది. ఈ విషయం కాస్తంత పాతదైనా ..పలువురు సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరికొందరు ఈ విషయం గురించి మాట్లాడటానికి వెనుకాడుతున్నారు.
అయితే నానా పటేకర్ అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తూ మీడియాతో మాట్లాడారు. షూటింగ్ లో వంద ,రెండు వందల మంది జనం మద్య ఎవరైనా, అసలు లైంగిక వేధింపులకు పాల్పడటం సాధ్యమేనా అని అన్నారు. దాంతో నానాకి కూడా జనం సపోర్ట్ ఇస్తున్నారు. ఈ వివాదం ఇలా ఉండగానే ..తను ఈ సారి బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడనీ లైంగికంగా వేధించాడని తనూ ఆరోపించింది.
అప్పట్లో అంటే ‘చాకొలెట్: డీప్ డార్క్ సీక్రెట్స్’ సినిమా షూటింగ్ లో తనతో దర్శకుడు వివేక్ అసభ్యంగా ప్రవర్తించాడని తనూశ్రీ కామెంట్స్ చేసింది. ఆ సినిమా పాట షూటింగ్ సమయంలో తనను బట్టలు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా వివేక్ వేధించాడని ఆరోపించింది.
అయితే అదే సమయంలో అక్కడే ఉన్న సునీల్ శెట్టి – ఇర్ఫాన్ ఖాన్ లు తనను కాపాడారని తెలిపింది. వివేక్ పై వారిద్దరూ కోప్పడటంతో అతడు వెనక్కు తగ్గాడని చెప్పింది. దాంతో వివేక్ పై తనూ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి.