టీజర్ : ‘విశ్వామిత్ర’ సృష్టి ఈ సినిమాలో కనిపించనుందా

అంజలితో ..గీతాంజలి, కలర్స్ స్వాతితో త్రిపుర’ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజకిరణ్. ఆయన తన తాజా చిత్రాన్ని మరో లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ‘విశ్వామిత్ర’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో  ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేం నందితా ఇందులో హీరోయిన్. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు.

మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్ నిర్మిస్తున్న  ఈ చిత్రం… ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రొస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. నందిత తో పాటు సత్యం రాజ్‌, విద్యుల్లేఖ రామన్‌, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు.

అలాగే ‘జక్కన్న’ చిత్ర దర్శకుడు ఆకెళ్ల వంశీకృష్ణ మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్‌: ఉపేంద్ర, ఆర్ట్‌–చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: రాజకిరణ్‌