ఇంటర్నెట్లో “టాక్సీవాలా “

విజయ్ దేవరకొండ , ప్రియాంక జవాల్కర్  జంటగా రాహుల్  సాంకృత్యాన్  దర్శకత్వంలో “టాక్సీవాలా ” సినిమా ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది . ఐయితే ఇప్పుడు ఈ వార్త నిర్మాతల వెన్నులో చలి పుట్టిస్తుంది . విడుదలకు ముందే  నెట్లో ఈ సినిమా ప్రత్యక్షమైందనే వార్త  సోషల్ మీడియాలో వచ్చేసింది .  ఒక సినిమా కోట్లు పెట్టి నిర్మిస్తే ఆ సినిమా విడుదల కాకముందే పైరసీ కావడం ఊహించలేని విషయం . టాక్సీవాలా సినిమా పైరసీ అయ్యిందన్న వార్త  ఆ చిత్ర నిర్మాతలనే కాక  తెలుగు సినిమా రంగాన్ని కుదిపేస్తున్నది .