యువ హీరో విజయ్ దేవరకొండకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన షూటింగ్ లో ఉన్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. సెక్యూరిటీ వారు రక్షించకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉండేదే. పూర్తి వివరాలు, వీడియో కింద ఉన్నాయి.
విజయ్ దేవరకొండ తాజా చితం డియర్ కామ్రేడ్ రూపొందుతున్నది. గత కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కాకినాడలో జరుగుతున్నది. విజయ్ దేవరకొండ పై ఒక సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యాడు.
పరుగెత్తుతూ ట్రైన్ ఎక్కబోయే సీన్ చేస్తుంటే ఆయనకు ప్రమాదం జరిగింది. ట్రైన్ ఎక్కబోయే సమయంలో ఆయన బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాడు. దీంతో పక్కనే ఉన్న సిబ్బంది అప్రమత్తమై విజయ్ దేవరకొండను పక్కకు లాగేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే బ్యాలెన్స్ తప్పి ట్రైన్ కింద పడేవాడే.
ఈ ప్రమాదంలో విజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ఆయన గాయపడిన ఫొటోలను తన ఇన్స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.