విజయదేవరకొండ ఎంతగా కుర్రాళ్లలోకి వెళ్లిపోయారంటే ఆయన స్టైల్స్ ని అనుకరిస్తున్నారు. ఆయన మాటలను బయిటవాడుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ని కుర్రాళ్లు ఎడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ విషయం ఎన్నికల సంఘం కూడా గమనించినట్లుంది. ఓటింగ్ పై యూత్ కు అవగాహన రావాలంటే విజయదేవరకొండ లాంటి యంగ్ హీరో చేత చెప్పిస్తే బెస్ట్ అని ఎన్నికల సంఘం భావించింది.
వివరాల్లోకి వెళితే… తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖుల్ని అంబాసిడర్లుగా నియమిస్తున్నట్టు సీఈవో రజత్ కుమార్ తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లాకు విజయ్ దేవర కొండ ను ప్రత్యేక అంబాసిడర్ గా నియమించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలిపారు. అన్ని జిల్లాలకు బ్రాండ్ అంబాసిడర్లు ఉంటారని, టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న అంబాసిడర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘టాక్సీవాలా’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘నోటా’ చిత్రం తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్లాఫ్ కావడంతో ఇప్పుడు ఆశలు మొత్తం టాక్సీవాలా పైనే పెట్టుకున్నాడు. ఈ చిత్రం నవంబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.