“ము ము ముద్దంటే చేదా ..? నీకా ఉద్దేశం లేదా?” ఇది ఒకప్పటి సినిమాలో పాట. ఆరోజుల్లో యువతి యువకులు కలసి తిరిగినా ముద్దు దగ్గరకు వచ్చేటప్పటికే హద్దుల్లో ఉండేవారు. కానీ కాలం మారింది తరాలు మారిపోయాయి. ఒకప్పటి విలువలు ఇప్పుడు వలువల్లా జారీ మారి పోయాయి.
ఇప్పటి తరం చాలా అడ్వాన్స్ అయిపోతున్నారు. మన సంస్కృతీ, సంప్రదాయం అని పెద్దవారు పోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు, పాటించడమూ లేదు. పాశ్చాత్య ప్రభావం యువతరం మీద ఎక్కువగా వుంది. “ము ము ముద్దంటే మోజే … నాకా ఉద్దేశ్యం వుందే ” అని ముఖం మీదే చెబుతున్నారు . ముద్దు ముద్దు మాటల్తో ముద్దులోకి దించేస్తున్నారు.
సినిమాల్లో అయితే ఇప్పుడు హీరోయిన్లను ముద్దు పెట్టుకోవం ఓ ఫ్యాషన్ అయిపోయింది ఓ వ్యాపార లక్షణమై పోయింది. తాజాగా విజయ్ దేవరకొండ ఈ ముద్దులు పెట్టొకొవడంలో ముందున్నాడు. “అర్జున్ రెడ్డి” సినిమాలో శాలిని పాండే తో విజయ్ దేవరకొండ పెట్టుకున్న ముద్దు
కుర్రకారును కిర్రెక్కించింది.
ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇక” గీత గోవిందం “సినిమాలో రష్మిక తో విజయ్ ముద్దు కితకితలు పెట్టించింది. ఇప్పుడు కెఎస్ రామారావు సినిమాలో కూడా విజయ్ కు ముద్దు సీన్ ఉండొచ్చేమో? ఇంతకీ విజయ్ దేవరకొండ మొదటి కిస్ శాలిని పాండే దేనా? ఈ అనుమానం చాలా మందికి వచ్చింది.
దీనిపై విజయ్ క్లారిటీ ఇచ్చాడు. కాలేజీలో చదువుకొనే రోజుల్లో తన క్లాస్ మేట్ ను కిస్ చేశాడట. ఆ కిస్ ఇప్పటికీ కిక్కు ఇస్తుందట.
ఎంతైనా మొదటి ముద్దు కదా! మనసులో ముద్రించుకు పోతుంది. అది విజయ్ ముద్దు జ్ఞాపకం.