ఎన్టీఆర్ బయోపిక్: బసరతారకం లుక్ వచ్చేసింది..పోలికలు ఉన్నట్లేనా

తెలగువారి అందరి దృష్టి ఎన్టీఆర్‌ బయోపిక్‌ మీదే ఉందన్న సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తలతో రూపొందిస్తున్నారు. ముఖ్యంగా గెటప్ ల విషయంలో టీమ్ చాల కష్టపడుతోంది. ఏమాత్రం తేడా కొట్టినా మొత్తం శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. మొన్న విడుదల చేసిన రకుల్ ప్రీతి సింగ్ ..శ్రీదేవి గెటప్ విషయంలో అదే జరిగింది.

తాజాగా   ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం లుక్‌ బయటికి విడుదలైంది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. బసవతారకంలా తయారై అద్దం ముందు కూర్చుని తన అందాన్ని చూసుకుంటున్న ఫొటోను విద్యాబాలన్  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.ఆ ఫొటోపై ‘నేనేం చూస్తున్నాను’ అని రాశారు. దాంతో ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక  ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో కుమారుడు హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌, చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి  సంగీతం అందిస్తున్నారు. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 2019 జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 24 ‘మహానాయకుడు’గా విడుదల చేస్తారు.