`ఘ‌ర్ష‌ణ` సీక్వెల్ చేస్తే వెంకీ- అశిన్ రెడీనా?

బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల సీక్వెల్ సినిమాల‌కు ఉండే క్రేజు వేరు. పైగా గౌత‌మ్ మీన‌న్ లాంటి క్లాసిక్ డైరెక్ట‌ర్ ఓ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారంటే అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది. ఇంత‌కుముందు గౌత‌మ్ తెర‌కెక్కించిన క్లాసిక్ హిట్ మూవీ కాఖా కాఖా కి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్ప‌టికీ ఆ సీక్వెల్ సంగ‌తి తేల‌లేదు.

తాజాగా జ్యోతిక ఓ లైవ్ చాట్ లో చేసిన ప్ర‌తిపాద‌న గౌత‌మ్ చెవికి చేరింద‌ట‌. కాఖా కాఖా సీక్వెల్ తీస్తే తాను సూర్య రెడీగా ఉన్నామ‌ని జ్యోతిక ఈ చాట్ లో అన‌డం ప్ర‌స్తుతం అభిమానుల్లో హీట్ పెంచింది. ఇదో ఠ‌ఫ్ కాప్ డ్రామా .. స్టైలిష్ మ్యూజిక‌ల్ హిట్ చిత్రం. అద్భుత‌మైన ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. సీక్వెల్లోనూ తామే న‌టించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని జ్యోతిక – సూర్య జంట ప్ర‌క‌టించ‌డంతో అది వైర‌ల్ గా మారింది. ఇక ఈ సినిమాని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ – అశిన్ జంట‌గా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించారు. హ్యారిస్ జైరాజ్ అద్భుత‌మైన బాణీలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్. అందుకే సీక్వెల్ తెర‌కెక్కుతే చూడాల‌న్న ఆస‌క్తి తెలుగు ఆడియెన్ కి ఉంది. ఒక‌వేళ చేస్తే గ‌నుక‌ ఈసారి వెంకీ- అశిన్ నే గౌత‌మ్ రిపీట్ చేస్తారా? అన్న‌ది ఇంట్రెస్టింగ్.

`ఘ‌ర్ష‌ణ` సీక్వెల్ చేస్తే వెంకీ- అశిన్ రెడీనా?

బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల సీక్వెల్ సినిమాల‌కు ఉండే క్రేజు వేరు. పైగా గౌత‌మ్ మీన‌న్ లాంటి క్లాసిక్ డైరెక్ట‌ర్ ఓ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారంటే అభిమానుల్లో ఉత్కంఠ ఉంటుంది. ఇంత‌కుముందు గౌత‌మ్ తెర‌కెక్కించిన క్లాసిక్ హిట్ మూవీ కాఖా కాఖా కి సీక్వెల్ తెర‌కెక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇప్ప‌టికీ ఆ సీక్వెల్ సంగ‌తి తేల‌లేదు.

తాజాగా జ్యోతిక ఓ లైవ్ చాట్ లో చేసిన ప్ర‌తిపాద‌న గౌత‌మ్ చెవికి చేరింద‌ట‌. కాఖా కాఖా సీక్వెల్ తీస్తే తాను సూర్య రెడీగా ఉన్నామ‌ని జ్యోతిక ఈ చాట్ లో అన‌డం ప్ర‌స్తుతం అభిమానుల్లో హీట్ పెంచింది. ఇదో ఠ‌ఫ్ కాప్ డ్రామా .. స్టైలిష్ మ్యూజిక‌ల్ హిట్ చిత్రం. అద్భుత‌మైన ప్రేమ‌క‌థ ఆక‌ట్టుకుంటుంది. సీక్వెల్లోనూ తామే న‌టించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని జ్యోతిక – సూర్య జంట ప్ర‌క‌టించ‌డంతో అది వైర‌ల్ గా మారింది. ఇక ఈ సినిమాని తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ – అశిన్ జంట‌గా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించారు. హ్యారిస్ జైరాజ్ అద్భుత‌మైన బాణీలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్. అందుకే సీక్వెల్ తెర‌కెక్కుతే చూడాల‌న్న ఆస‌క్తి తెలుగు ఆడియెన్ కి ఉంది. ఒక‌వేళ చేస్తే గ‌నుక‌ ఈసారి వెంకీ- అశిన్ నే గౌత‌మ్ రిపీట్ చేస్తారా? అన్న‌ది ఇంట్రెస్టింగ్. ప్ర‌స్తుతం నార‌ప్ప‌గా న‌టిస్తున్న వెంకీ .. తాజా లాక్ డౌన్ స‌న్నివేశంపై ట్విట్ట‌ర్ లో ఆస‌క్తిక‌ర సందేశాన్ని ఇచ్చారు.