“ది లైఫ్ ఆఫ్ ముత్తు” సినిమా రివ్యూ

నటీనటులు: శింబు, సిద్ధి ఇది, రాధిక శరత్ కుమార్

దర్శకత్వం : గౌతమ్ మీనన్

నిర్మాతలు: ఇసారి కే గణేష్

సంగీత దర్శకుడు: ఏ ఆర్ రెహమాన్

ఒకప్పుడు తమిళ్ లో స్టార్ హీరోల్లో ఒకడిగా ఉన్న శింబు ఆ తర్వాత ఏవో కారణాలవల్ల డీలా పడిపోయి, కొన్నాళ్ళు సినిమాలకు దూరం గా ఉన్నాడు. తన తో పాటే కెరీర్ స్టార్ట్ చేసిన ధనుష్ మాత్రం పాన్ ఇండియా హీరో అయిపోయాడు. చాన్నాళ్ల తర్వాత తనకు ‘విన్నైతాండి  వరువాయా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ తో మరోసారి జతకట్టాడు శింబు. కానీ ఈ సారి లవ్ స్టోరీ కాకుండా యాక్షన్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

కథ
:

ముత్తు (శింబు) ఒక పేద వాడు. చిన్నప్పటినుండి ముత్తు, తన తల్లి ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని నెట్టుకుంటూ వస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత జీవనోపాధికోసం ముంబై కి మకాం మారుస్తారు. అక్కడ హోటల్ లో ఉద్యోగం లో చేరతాడు శింబు.  అయితే అంతా సజావుగా సాగుతుంధీ అనుకునే సమయానికి అతను తన రెస్టారెంట్‌లో ఒక హత్యను చూస్తాడు ఇక అక్కడ నుండి, అతని జీవితం వేరే మలుపు తిరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఒక గ్యాంగ్ తో తలపడి డాన్ గా ఎదుగుతాడు. గ్యాంగ్స్టర్ గా మారిన  ముత్తు ప్రయాణం ఏమిటన్నది మిగతా కథ.

సినిమా ఎలా ఉందంటే:

హాలీవుడ్ సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ సినిమాను రిఫరెన్స్‌గా తీసుకుని అన్ని భాషల్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి కాన్సెప్ట్ తోనే కమల్ హాసన్ ‘నాయకుడు’, అమితాబ్ ‘దీవార్’ లాంటివి చాలా వచ్చాయి.

ఈ సినిమాలో ముత్తుని గ్యాంగ్‌స్టర్‌గా పరిచయం చేయడం ద్వారా సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. మొదట్లో కొంచెం డ్రాగ్ అనిపించినా కానీ ముత్తు ముంబైలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా  మరింత ఇంటరెస్టింగ్ గా మారుతుంది.

గౌతమ్ మీనన్ లవ్ స్టోరీలు, పోలీస్  డ్రామాలు తీయడంలో నిపుణుడు. కానీ మొదటిసారిగా డిఫరెంట్ సబ్జెక్ట్‌ని ఎంచుకుని, సినిమా అంతటా ప్రేక్షకులను కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యాడు.

ప్లస్ పాయింట్లు:

బలమైన పాత్రలు
సినిమాటోగ్రఫీ
సంగీతం

మైనస్ పాయింట్లు:

రొటీన్ కథాంశం
ఎమోషన్స్ ఆకట్టుకునేలా లేకపోవడం

మొత్తంమీద, ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’ సినిమా  కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం బాగా నచ్చుతుంది.