స్టార్ క‌మెడియ‌న్ల లిస్టులో వెన్నెల కిశోర్!

                                                                       (ధ్యాన్)
నేనింక సినిమాలు చేయ‌ను. నేనింక సినిమాలు త‌గ్గించుకుంటున్నాను.. అని ఏ ముహూర్తంలో అన్నాడోగానీ బ్రహ్మానందం.. ప‌క్క‌నే విన్న దేవుళ్లు త‌థాస్తు అన్నారు. అప్పుడ‌ప్పుడే పైకి వ‌స్తున్న వెన్నెల కిశోర్ జీవితంలో మ‌రింత వెన్నెల‌ను కురిపించారు.అప్ప‌టిదాకా చిన్నా చిత‌కా పాత్ర‌లు, చిన్న చిన్న సినిమాల్లో హీరో వేషాలు వేసుకుంటున్న వెన్నెల కిశోర్ ఉన్న‌ట్టుండి స్టార్ క‌మెడియ‌న్ల లిస్టులో చేరిపోయాడు. ఈ మ‌ధ్య గీత‌గోవిందం క్లైమాక్స్ సీన్లో వెన్నెల కిశోర్ పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. ఆ విష‌యాన్ని గ్ర‌హించి `శైల‌జారెడ్డి అల్లుడు`లో అప్ప‌టిక‌ప్పుడు మూడు రోజులు వెన్నెల‌కిశోర్ మీద ఓ ఎపిసోడ్ తీసి ఇంక్లూడ్ చేశార‌ట‌. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ యూనిట్ కిశోర్‌కి స్పెషల్ టిక్కెట్ వేసి అమెరికా తీసుకెళ్లింద‌ట‌. అంతే కాదు.. కాల్షీట్లు లేవురా మొర్రో అంటే విన‌కుండా డబుల్ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసింద‌ట‌. ఇప్పుడిప్పుడే మ‌ర‌లా క‌మెడియ‌న్‌గా రీ ఎంట్రీ ఇస్తున్న సునీల్ వ‌ల్ల ఒక‌వేళ కిశోర్ కి పోటీ ఎదురైతే ఎదుర‌వ్వాల్సిందే కానీ, అప్ప‌టిదాకా నో ఫిక‌ర్‌..