వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు బాబి డైరక్షన్ లో ఈ సినిమా ఉండబోతోంది. టైటిల్ ..వెంకీ మామ అని పెట్టారని తెలుస్తోంది. ఇక ఇలా ప్రాజెక్టు ఓకే అయ్యిందో లేదో అప్పుడే ఈ చిత్రం కథ అంటూ ఒకటి బయిట చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో వెంకటేష్ పల్లెటూళ్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. వెంకీకు చాలాకాలం క్రితమే తన చెల్లి, ఆమె కొడుకు (మేనల్లుడు నాగచైతన్య) దూరమవుతారు. దాంతో అప్పటినుంచి వాళ్ల కోసం వెతుకుతూంటాడు. ఈ లోగా వాళ్లు హైదరాబాద్ లో ఉన్నారని తెలుస్తుంది. దాంతో వెంకీ స్వయంగా సిటీ కు వస్తాడు. పల్లెటూరు అమాయకత్వంతో వెంకీ మామ..అక్కడ వెతుకుతూంటాడు.
మరో ప్రక్క వాళ్లు అల్లుడు వాళ్లకు కనపడతాడు కానీ వాళ్లే అని తెలియక వాళ్లతో జర్నీ చేస్తాడు. దాంతో మామ, అల్లుళ్ల మధ్య ఫన్ పండుతుంది. వీళ్ల మధ్య ఓ విలన్ . వాడు తన కార్యకలాపాలకు అడ్డు వస్తున్నాడని నాగచైతన్య ని లేపాయ్యాలని చూస్తాడు. ఆ విషయం వెంకీ కు తెలియటం ఇలా సరదా..సరదాగా సాగుతుంది. పల్లెటూరు మామగా వెంకటేష్, సిటీ కుర్రాడుగా నాగచైతన్య అదరకొడతారంటున్నారు.